దేశం, మతం, కులం, ప్రాంతం ఏదైనా కానీవ్వండి మహిళలపై జరిగే అఘాయిత్యాలు ఏ మాత్రం తగ్గటం లేదు. పాకిస్తాన్ లో ఒక యువతి పైన జరిగిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. యువతిపైన ఒకేసారి 300 మంది దాడి చేయటం అది కూడా స్వాతంత్య్ర దినోత్సవం (Independence day) రోజు ఈ ఘటన చోటు చేసుకోవటం అందరిని ఆగ్రహానికి గురి చేస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్థాన్ (Pakistan) లాహోర్ (Lahore) లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది ఓ మహిళ టిక్‌టాకర్‌పై దాడి చేసిన ఘటన సంబంధిత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం శృష్టిస్తుంది. 


Also Read: Bigg Boss: బిగ్‌బాస్‌ లోకి తీసుకోలేదని రోడ్లపై ప్రముఖ నటి హల్‌చల్‌.. వైరల్ అవుతున్న వీడియో!


"అది ఆగస్ట్ 14 2021 పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం (Pakistan independence day) రోజున తన స్నేహితురాళ్లతో కలిసి లాహోర్‌లోని మినార్-ఇ-పాకిస్తాన్ (Minar e pakistan) వద్ద టిక్‌టాక్ లో వీడియో తీస్తుంది. అది చూసిన 300 మంది ఒకేసారి ఆమెను చుట్టు ముట్టి దాడి చేసారు. అమ్మాయని కూడా చూడకుండా, టిక్‌టాకర్‌ను అటు-ఉటు లాగుతూ, గాల్లోకి ఎగిరేసి, బట్టలు చించటానికి ప్రయత్నించారు. 


అంతేకాకుండా, ఆమె చేతికి ఉన్న ఉంగరం, చెవి కమ్మలు,స్నేహితుల మొబైల్ ఫోన్లు, దాదాపు 15 వేల రూపాయలు లాక్కున్నారు. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డు మినార్-ఇ-పాకిస్థాన్ గేటు (Minar e pakistan) తెరవటంతో టిక్‌టాకర్‌ మరియు ఆమె స్నేహితులు అక్కడి నుండి తప్పించుకున్నారు. 





Also Read: Mohammad Siraj Record: లార్డ్స్ టెస్ట్‌లో 39 ఏళ్ల రికార్డు సమం చేసిన టీమ్ ఇండియా పేసర్ సిరాజ్
తరువాత యువతి పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురై కామెంట్స్ చేస్తూ యువతికి మద్దతు తెలుపుతున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి