Video Viral: అమెరికాలోని బోస్టర్ శివార్లలో రైలు ప్రమాదం సంభవించింది. మిస్టిక్ నది వంతెనపై వెళ్తున్న రైలులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. రైలు ఇంజన్ భాగంలో నుంచి మంటలు వ్యాపించాయి. మంటలు, పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు చేశారు. రైలు కిటికిలను తొలగించి బయట పడ్డారు. మరికొందరు నదిలో దూకారు. ఓ మహిళ ప్రాణ భయంతో నదిలో దూకిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెంటనే అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని చక్క దిద్దారు. ఈఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలు ఇంజన్‌లో సాంకేతిక కారణాలతోనే మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. 



ఈ విషయాన్ని ఎంబీటీఏ వెల్లడించింది. వెల్లింగ్టన్-అసెంబ్లీ స్టేషన్ మధ్య వంతెనపై ప్రమాదం జరిగినట్లు తెలిపింది. ప్రమాదంలో రైలు ముందు భాగం ధ్వంసమయ్యిందని..కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొంది. మరికొంత మంది ప్రత్యక్ష సాక్షులు ప్రమాద సమయంలో పరిస్థితులను వివరించారు. ముందు భాగం నుంచి భారీ శబ్ధాలు రావడంతో పరుగులు తీశామని..తన పక్కన ఉన్న వాళ్లు సైతం ప్రాణ భయంతో ఉలిక్కి పడ్డారని తెలిపారు.



Also read:Rain Alert: తెలంగాణలో రెయిన్ అలర్ట్..ఐదురోజులపాటు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ..!


Also read:Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా..కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook