Flowers Plants Thief: ఎక్కడైనా ఇంట్లో దొంగలు పడ్డారంటే ఎవరైనా ఏమనుకుంటారు. ఆ ఇంట్లో బంగారు నగలు, భారీ మొత్తంలో నగదు పోయి ఉంటాయనే కదా.. కానీ ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన మాత్రం అందుకు భిన్నంగా ఉండటమే కాదు.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణంలోని శ్రీనివాస నగర్ కాలనీలో బాలార్జున్ గౌడ్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న పెరటి లోకి రాత్రి వేళ ప్రవేశించిన ఓ దొంగ... అక్కడ నాటిన ఓ పూల మొక్కను చోరీ చేశాడు. అరుదుగా పెంచుకునే నూరు వరాల పూల మొక్కను దొంగోడు తీసుకుపోయాడంటూ ఆ కుటుంబం వాపోయింది. 


పూల మొక్కను చోరీ చేయడానికి వచ్చిన ఆ దొంగ తీరు చూస్తే.. ఏరికోరి మరీ దాన్నే వెతుక్కుని దొంగిలించుకుపోయిన తీరు చూస్తే... ఆ దొంగ కన్నంతా అరుదైన ఆ పూల మొక్కపైనే ఉంది అని అర్థం అవుతోంది. 


ఇలా ఇంటి పెరట్లోంచి పూల మొక్కలు మాయం అవడం ఇదేం మొదటిసారి కాదట ... జనం ఎంతో ఇష్టంగా పెంచుకున్న పూల మొక్కలను, ఈ పూల దొంగ రోజుకు ఒకటి చొప్పున మాయం చేస్తున్నాడు. వరుసగా పూల మొక్కలు చోరీకి గురవుతున్న ఘటనలు చూసి జనం షాకవుతున్నారు. ఎప్పుడూ లేనిది ఇలా పూల మొక్కలు మాయం చేసే దొంగ రావడం ఏంటా అని అందరూ ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ చోరీ చేసిన ఆ పూల మొక్కలను ఆ పూల దొంగ ఏం చేస్తున్నాడు ? మరొకరికి అమ్ముకుంటున్నాడా ? లేక తన ఇంట్లోనే ఇష్టంగా పెంచుకుంటున్నాడా ? అని జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి