Viral Video: ఏంగుండెరా వాడిదీ.. ఆవునో, మేకనో తోలినట్లు సింహన్ని తరిమేశాడు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదే..
Gujarat lion viral video: రైల్వే ట్రాక్ మీదకు సింహం వచ్చింది. దీంతో అక్కడున్న ట్రాక్ మెన్ చేతిలో కర్రను పట్టుకుని అదేదో.. ఆవునో.. మేకనో తోలినట్లు సింహన్ని దూరంగా తోలేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Guard chases lion away from railway track video: సింహన్ని అడవికి రాజుగా చెప్తుంటారు. అదే విధంగా సింహం గాండ్రిస్తే.. కొన్ని కిలోమీటర్ల వరకు కూడా దాని సౌండ్ విన్పిస్తుంది. అంతే కాకుండా.. సింహం కేవలం ఆకలేస్తే మాత్రమే వేటాడుతాయంట. లేకుంటే.. పక్క నుంచి ఏ జీవులు వెళ్లిన కూడా అస్సలు పట్టించుకొవంట. ఇక ఎక్కువగా సింహలు గుంపులుగా తిరుగుతుంటాయి. మగ సింహలు.. గుంపుకు నాయకత్వం వహిస్తాయి.
ఇతర ప్రాంతాల్లోని సింహాలు తమ అడ్డాలోకి రాకుండా చూస్తుంటాయి. ఆడ సింహలు ఎక్కువగా వేటాడుతుంటాయి. అరుదైన సందర్భాలలో మగ సింహలు కూడా వేటాడుతుంటాయంట. అయితే.. సింహలను చూస్తేనే చాలా మంది డెంజర్ గా ఉంటాయి. దాదాపు.. టన్ను వరకు బరువుంటాయి.
దాని జూలు, పంజా, ఆకారం చూస్తేనే.. లోపల తడిసిపోతుంది. అలాంటిది సింహం మన ముందుకు వస్తే ఇంకేమైన ఉందా.. ఒకటి, రెండు అన్ని కూడా నిలబడ్డ చోటే అయిపోతాయి. ఈ క్రమంలో గుజరాత్ లోని భావ్ నగర్ లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
గుజరాత్ లోని భావ్ నగర్లో.. ఒక సింహం అక్కడున్న రైల్వే ట్రాక్ మీదకు వచ్చింది. అప్పుడు అక్కడే ఉన్న గార్డ్ సింహంను ఒక కర్రను తీసుకుని అదేదో.. ఆవునో.. మేకనో తోలినట్లు.. అడవిలోకి వెళ్లేలా అరుస్తూ.. దాన్ని తరిమేశాడు. అతను సింహంను చూసి ఏమాత్రం కూడా భయపడకుండా.. ఇలా చేశాడు. రైల్వే గార్డ్ చేసిన పనిని దూరం నుంచి కొంత మంది తమ ఫోన్ లలో వీడియోలను రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్ గా మారింది.
Read more: Viral Video: అరె వావ్.. జిమ్‌లో తగ్గాఫార్ వర్కౌట్స్ చేస్తున్న ఊసర వెల్లులు.. వీడియో వైరల్..
దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. ఏంగుండె దైర్యంరా వాడిది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అదేమైన.. ఆవు అనుకున్నావా.. లేదా మేక అనుకున్నావా.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter