Friends' VIP Treatment At Airport : ఫ్రెండ్స్.. జీవితంలో కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా వీడిపోనిది ఫ్రెండ్ ఒక్కడే అంటూ వెనకటికే ఓ సినీ గేయ రచయిత ఫ్రెండ్ షిప్ కి సింగిల్ లైన్ మీనింగ్ చెప్పడం గుర్తుంది కదా.. ఫ్రెండ్ షిప్ కి ఉండే మహిళ అలాంటిది. అలాగే కొంతమంది ఫ్రెండ్స్ తమ ఫ్రెండ్స్ ని సడెన్ సర్ ప్రైజ్ చేయడం కోసం ఏమైనా చేస్తుంటారు.. ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటుంటారు. సినిమాల్లో ఫ్రెండ్ షిప్ గురించి కొన్ని గొప్ప గొప్ప సీన్స్ చూసినప్పుడు ఇలాంటి బిల్డప్స్ అన్నీ సినిమాల్లోనే సాధ్యం కానీ రియల్ లైఫ్ లో ఎవరు చేస్తారు గురూ అనిపిస్తుంటుంది కదా! కానీ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా కొంతమంది స్నేహితులు తమ స్నేహితులను ఖుషీ చేయడం కోసం ఏమైనా చేస్తుంటారు. ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే వైరల్ వీడియో కూడా అలాంటిదే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లి తిరిగి మీ సొంతూరికి వస్తున్నప్పుడు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మీ స్నేహితులు ఎయిర్ పోర్టుకు వచ్చారా అని అడిగితే చాలా మంది విషయంలోనే యస్ అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ని రిసీవ్ చేసుకోవడానికి స్నేహితులు ఎయిర్ పోర్ట్సుకి వెళ్లడం సర్వసాధారణం కాబట్టి. కానీ వీవీఐపి రేంజులో.. చుట్టూ ఉన్న వాళ్లంతా సినిమా చూసినట్టు చూస్తూ " ఈ వీఐపి ఎవడ్రా బాబూ" అని బుర్ర గోక్కునేలా ఈ లెవెల్లో మీకు ఎప్పుడైనా వెల్‌కమ్ లభించిందా అంటే కచ్చితంగా మీ నుంచి నో అనే సమాధానమే వస్తుంది. ఓకే ఓకే.. మిమ్మల్ని ఇంకా ఎక్కువసేపు సస్పెన్స్‌లో పెట్టకుండా ముందుగా మీకు ఆ వీడియో చూపించేస్తాం.

చూశారు కదా.. ఒక పెద్ద బిజినెస్‌మేన్‌కి చుట్టూ సూటుబూటు వేసుకున్న గార్డ్స్‌తో ఎలాగైతే కార్పొరేట్ సెక్యురిటీ కవర్ ఉంటుందో.. అచ్చం అలాగే తమ స్నేహితుడిని చుట్టుముట్టి, తమ మధ్య జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇచ్చి అతడిని తీసుకెళ్తున్న తీరు చూస్తుంటే.. చుట్టూ ఉన్న వాళ్లకు " కచ్చితంగా వీడెవడో బడా వ్యాపారవేత్తనో లేక బిజినేస్ మేన్ కొడుకో అయ్యుంటాడు " అని అనుకునేలా ఉంది కదా. ఇలాంటి దోస్తుల్ని చూసినప్పుడే కదా ఎవరికైనా జెలసీగా అనిపిస్తుంది. వాళ్లు ఇలాంటి వీడియోను రీల్స్ కోసమే చేసినా.. షార్ట్స్ కోసమే చేసినా.. ఈ వీడియో చూసిన వాళ్లకు ఎవరికైనా.. ఇలాంటి ఫ్రెండ్స్ మనకి కూడా ఉంటే బాగుండు అని అనిపించకమానదు.