Viral video: కరోనా కల్లోలం కారణంగా ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ పెట్టుకుంటున్నారు. రెండేళ్లుగా ఫేస్​మాస్క్ పెట్టుకోవడం అనేది ఓ తప్పనిసరి క్రియగా మారిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాస్క్ ఎక్కువ సేపు పెట్టుకోవడం వల్ల ఇబ్బంది పడుతున్నట్లు చాలా మంది చెప్పడం విన్నాం కానీ.. మాస్క్​ పెట్టుకోవడడం ఎలాగో తెలీక.. ఇబ్బంది పడ్డ వారి గురించి ఎప్పుడైనా విన్నారా?


మాస్క్​ పెట్టుకోవడంలో ఇబ్బందా? అదేమిటి ఆలోచిస్తున్నారా? అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫన్నీ వీడియో చూడాల్సిందే.


ఇంతకూ వీడియోలో ఏముందంటే..?


ఉత్తర్​ ప్రదేశ్​లోని గోరఖ్​పూర్​లో శివ్​సేనా నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఎంపీ ధైర్యశీల్ మానే ప్రసంగిస్తున్నారు. ఆయన పక్కన్నే నిలబడ్డ ఓ కార్యకర్త మాస్క్ పెట్టుకునేందుకు ప్రయత్నించారు.


ఓ సారి ముఖానికి ముక్కుపైకి పెట్టుకుని.. అది కరెక్ట్​ కాదేమోనని మళ్లీ వెనక్కి తీశారు. ఇక మాస్క్​ను ఎలా పెట్టుకోవాలో అని నానా రకాలుగా ప్రయత్నాలు చేశాడు. చివరకు చెవులకు పెట్టుకున్నాడు. అయితే అది చేవులకు తగిలించుకునే మాస్క్ కాదని గ్రహించి.. మళ్లీ తీశాడు.


ఇలా ఎత సేపు ప్రయత్నించినా తనకు అర్థం కాకపోడంతో ముందున్న మరో కార్యకర్త సహాయం తీసుకున్నాడు. ఆ వ్యక్తి చెప్పినట్లు చేసి ఎట్టకేలకు మాస్క్​ను సరిగ్గా పెట్టుకున్నాడు.


కేవలం మాస్క్ పెట్టుకునేందుకు ఆ వ్యక్తి దాదాపు రెండు నిమిషాలు టైం తీసుకున్నాడు. దీనితో ఈ వీడియో నెట్టింట్ట నవ్వులు పూయిస్తూ.. వైరల్​గా మారింది. ఎంపీ ప్రసంగం ఏమోగానీ.. ఆ వ్యక్తి మాస్క్ పెట్టుకునేందుకు చేసిన ప్రయత్నం మాత్రం ఇప్పుడు పాపులర్ అయిపోయింది. ఆ వీడియో చూసినవారంతా పడిపడి నవ్వుకుంటున్నారు.



ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిపై జోకులు వేస్తున్నారు. మరికొంత మందేమో ఆ వీడియోను మరో వీడియోకు జోడించి మీమ్స్ వేస్తున్నారు. హమ్మయ్యా ఎట్టకేలకు సాధించాడు అంటూ.. ఫన్నీగా స్పందిస్తున్నారు.


Also read: Russia Ukraine War: రష్యా సిబ్బంది హింసాత్మక చర్య.. సామాన్యుడి కారుపైకి ట్యాంక్ ఎక్కించి మరీ.. (వీడియో)


Also read: Noodles Pani Puri: పానీ పూరిని ఇలా కూడా తింటారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త రెసిపీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook