డేగ వేటాడటం చాలాసార్లు చూసే ఉంటారు కదా. ఇది ఎలాంటి పక్షి అంటే ఆకాశంలో అల్లంత దూరం నుంచి..భూమిపై ఉన్న టార్గెట్‌ను నిశితంగా గుర్తించి మరీ వేటాడుతుంది. బహుశా అందుకే ఈ వీడియో అంతలా వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డేగ కళ్లు. డేగ వేగం ఈ పదాలు ఊరికే పుట్టలేదు. ఆకాశంలో అంత ఎత్తు నుంచి ఎన్నో కిలోమీటర్ల దూరంలో భూమిపై అటు సముద్రంలో ఉన్న వేటను నిశితంగా గమనించి..ఒక్క ఉదుటున వేటాడగలదు. పాముల్ని అయితే మరింత సులభంగా వేటాడుతుంది. అయితే డేగ లాంటిదే మరో పక్షి వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఈ పక్షి పేరు గేవియావో. కోబ్రా వంటి భయంకర పాముల్ని సైతం ఈ పక్షి సునాయసంగా వేటాడగలదు. భయంకరమైన పాముల్ని అదిమి పట్టగలదు.


ఈ పక్షికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పక్షి నేలపై ఉన్న పచ్చరంగు భయంకరమైన పాముపై దాడి చేసింది. ఒక్క ఉదుటున ఓ కాలితో పాము తోకను అదిమి పట్టుకుంటుంది. మరో కాలితో పాము మధ్యభాగాన్ని పట్టుకుంటుంది. ఇంతలో తప్పించుకునే క్రమంలో ఆ పాము..ఆ పక్షిని కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే రెప్పపాటు వేగంతో స్పందించిన ఆ పక్షిరెండవ కాలితో పాము పడగ భాగాన్ని అదిమి పట్టుకుంటుంది. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.



భయంకరమైన పచ్చ పాముని వేటాడిన ఈ పక్షి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో animals_powers పేరుతో అప్‌లోడ్ అయింది. ఈ వీడియోపై పెద్దసంఖ్యలో నెటిజన్లు స్పందిస్తున్నారు. 


Also read: Snake Found on Flight: విమానంలో పాము.. పరుగులు పెట్టిన ప్రయాణికులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook