Nandu Met Accident : గాయపడ్డ గీతా మాధురి భర్త.. కదల్లేని స్థితిలో ఉన్నా కూడా
Geetha Madhuri Husband గీతా మాధురి భర్త నందు ప్రస్తుతం కాలికి పట్టి కట్టుకుని కనిపించాడు. చూస్తుంటే నందుకి యాక్సిడెంట్ అయినట్టుగా తెలుస్తోంది. గీతా మాధురి భర్తకు ప్రమాదం జరిగిందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
Geetha Madhuri Husband సింగర్ గీతా మాధురి భర్తగా, నటుడిగా, హీరోగా నందుకి టాలీవుడ్‌లో మంచి ఇమేజ్ ఉంది. కెరీర్ ప్రారంభంలో సైడ్ కారెక్టర్లు చేసుకుంటూ వచ్చాడు. చివరకు హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సవారి సినిమాతో ఓ మోస్తరు హిట్టు కొట్టేశాడు నందు. అయితే ఇప్పుడు నందు తన లుక్‌ని పూర్తిగా మార్చేశాడు. బీస్ట్ మోడ్‌లోకి మారిపోయాడు. అయితే ఇప్పుడు నందు కాలికి గాయమైనట్టుగా కనిపిస్తోంది.
నందు ప్రస్తుతం తన సినిమా పనులను పూర్తి చేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు. తన కాలికి గాయమైనా, నడవలేని స్థితిలో ఉన్నా కూడా డబ్బింగ్ చెప్పేందుకు స్టూడియోకి వచ్చాడు. ఇక డబ్బింగ్ స్టూడియోలో ఇలా పోజులిచ్చాడు. ఈ ఫోటోతోనే నందుకి యాక్సిడెంట్ అయినట్టుగా, కాలికి పట్టి కట్టినట్టు అర్థం అవుతోంది. అయితే ఇది ఎలా జరిగిందనే విషయం మాత్రం చెప్పలేదు.
నందు ఇప్పుడు క్రికెట్ కామెంటరీ, సినిమాలు అంటూ ఫుల్ బిజీగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఇలాంటి ఘటన జరిగింది. అయితే నందు మాత్రం ఇదేమీ పెద్ద ప్రమాదం కాదన్నట్టుగా లైట్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. డబ్బింగ్ స్టూడియోలో ఎంతో కూల్‌గా కనిపించాడు నందు. అందుకే ఆయన అభిమానులు కూడా అంతగా కంగారు పడటం లేదు. కానీ ఏం జరిగిందంటూ కామెంట్లలో అడిగేస్తున్నారు.
ఇక నందు రష్మీ గౌతమ్ కలిసి చేసిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాను భుజానికి ఎత్తుకుని మరీ ప్రమోట్ చేశారు. కానీ ఈ సినిమా మాత్రం ఏ రకంగానూ వర్కౌట్ కాలేదు. అటు కమర్షియల్ హిట్‌గానూ నిలవలేకపోయింది. ఇటు విమర్శకుల ప్రశంసలను దక్కించుకోలేకపోయింది. మరి ఇప్పుడు బీస్ట్ మోడ్‌లోకి మారిన నందు.. తన కష్టానికి తగిన ప్రతి ఫలాన్ని పొందుతాడా? లేదా? అన్నది చూడాలి.
Also Read: Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook