15 Feet King Cobra after itching: సాధారణంగా మనుషులకు దురద పెడితే.. చేతితో గోక్కుంటారు. వీపు లాంటి ప్రదేశంలో దురదేస్తే.. ఇతరుల సాయం తీసుకోవడమో లేదా కర్ర లాంటి పరికరాలతో దురదకు చెక్ పెడతారు. అయితే ఓ వ్యక్తి తనకు దురద పెడితే.. ఏకంగా పాముతో గోక్కున్నాడు. అది సాదాసీదా పాము కూడా కాదు..15 అడుగుల కింగ్ కోబ్రా. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ప్రకారం... చైనాలోని ఓ ఇంటి ఆవరణంలోకి భారీ కింగ్ కోబ్రా వస్తుంది. కింగ్ కోబ్రాను చూసిన కుక్క పెద్దగా అరుస్తుంది. దాంతో ఇంటి యజమానులు వచ్చి చూడగా.. వారికి 15 అడుగుల కింగ్ కోబ్రా కంటపడుతుంది. దాంతో వారు భయంతో వణికిపోయి స్నేక్ క్యాచర్‌కు కబురు పెడతారు. నలుగురు రంగంలోకి దిగి దానిని వెతుకుతారు. చాలా సమయం అనంతరం వారికి ఆ కింగ్ కోబ్రా కంటపడుతుంది. 


15 అడుగుల కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు నలుగురు కర్రలతో కుస్తీ పడతారు. ఈ క్రమంలో కొన్నిసార్లు కాటేయడానికి వారి మీదకు దూసుకొస్తుంది. అయినా కూడా వెనక్కి తగ్గని వారు.. కర్ర సాయంతో కింగ్ కోబ్రా తలను నేలకు అదిమిపడతారు. ఆపై ఓ వ్యక్తి వచ్చి దాని తలను పట్టుకుంటాడు. ఆపై అందరూ పామును బంధిస్తారు. కింగ్ కోబ్రాను పట్టుకున్న సమయంలో ఓ వ్యక్తికి చేతి దగ్గర దురద వేయగా.. పాముకేసి గోక్కుంటాడు. ఆపై తన కాలును కూడా కింగ్ కోబ్రా శరీరంతో రుద్దుకుంటాడు. 



ఆపై అందరు కలిసి ఓ సంచిలో కింగ్ కోబ్రా తలను పెడతారు. అనంతరం పామును సంచిలో బంధిస్తారు. ఇందుకు సంబందించిన వీడియోను 'Thú Vui 3 Miền' అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో సంవత్సరం క్రితందే అయినా.. ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోకి 2,414,610 వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన అందరూ షాక్ అవుతున్నారు. 'పాముతో గోక్కోవడం ఏంటి సామీ' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: నేహా మాలిక్ గ్లామర్ ట్రీట్.. సాగరతీరాన బికినీ అందాలతో కనువిందు చేస్తున్న హాట్ బ్యూటీ!


Also Read: Weight Loss Diet Chart: నిద్రపోతూ కూడా ఇలా కేవలం 15 రోజుల్లో బరువు తగ్గొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook