Dog and Tigers Video: జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. అదే జంతువుల వీడియో సహజత్వానికి భిన్నంగా ఉంటే ఇంకా వైరల్ అవుతాయి. అదే జరిగింది ఈ వీడియో విషయంలో.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియో ఎక్కడిదో గానీ..బాగా వైరల్ అవుతోంది. అసలైన పులుల మధ్య ఓ గ్రామ సింహం ఏ మాత్రం భయం లేకుండా హాయిగా ఆడుకుంటోంది. పులుల గుంపు మధ్య ఒకేఒక శునకం ఎంజాయ్ చేస్తోంది. వీడియో ఎక్కడిదో గానీ..నెటిజన్లు బాగా షేర్ చేస్తున్నారు. బాగా కామెంట్లు పెడుతున్నారు. 


గోల్డెన్ రిట్రైవర్ జాతికి చెందిన కుక్క ఇది. చుట్టూ నాలుగైదు పులుల మధ్య కలివిడిగా ఏ మాత్రం భయం లేకుండా తిరిగేస్తుంది. వీడియో తీస్తున్నవారిపై మాత్రం కోప్పడుతోంది. ఆ పులులు కూడా ఆ శునకాన్ని ఏమనడం లేదు. వీడియో ఉన్న ప్రాంతం చూస్తుంటే ఇదేదో అడవిలా లేదు. అది కూడా ఓ గ్రామంలా ఉంది. వివరాలు పరిశీలిస్తే..అసలా పులులకు ఆ కుక్క అమ్మలాంటిది. చిన్న కూనలుగా ఉన్నప్పుడు తల్లికి దూరమైన పులి పిల్లలు. ఆ కుక్కే వాటికి పాలిచ్చి పెంచింది. అందుకే ఆ పులులకు ఆ శునకం అమ్మ. ఇక పులుల గుంపునే కాపలాగా పెట్టుకున్న కుక్క దర్జాను అందరూ మెచ్చుకుంటున్నారు.



Also read: Groom Dance: పెళ్లి కొడుకు డ్యాన్స్‌.. సీన్ క‌ట్‌చేస్తే రూ. 2 ల‌క్ష‌లు ఫైన్! కారణం ఏంటంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook