నోబెల్ గ్రహీత మ్యాక్స్ బోర్న్ 135వ జయంతి
నోబెల్ గ్రహీత మ్యాక్స్ బోర్న్ యొక్క 135వ పుట్టినరోజున గూగుల్ ఒక డూడుల్ ను సృష్టించింది. ఈ డూడుల్ ను జర్మనీలోని బెర్లిన్ వాసి కాటి స్సిలాగి (Kati Szilagyi) తయారుచేసాడు.
డిసెంబరు 11, 1882 న జర్మనీలో జన్మించిన మ్యాక్స్ బోర్న్ 1954 లో 'ఫండమెంటల్ రీసర్చ్ ఇన్ క్వాంటం మెకానిక్స్' గానూ భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. నేడు క్వాంటం మెకానిక్స్ రంగంలో మ్యాక్స్ బోర్న్ యొక్క 'బోర్న్ థియరీ' క్వాంటం ఫిజిక్స్ లో దాదాపు ప్రతి పరిశోధనకు ఆధారంగా ఉంది.
మ్యాక్స్ బోర్న్ ఒక అత్యుత్తమ విద్యార్ధి. ఆయన గోట్టీన్ విశ్వవిద్యాలయంలో పీ హెచ్ డీ పట్టా పొందారు. అదే విశ్వవిద్యాలయంలో సైద్ధాంతిక భౌతికశాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆయన తన కాలంలోని అనేక ప్రసిద్ధ శాస్త్రవేత్తలకు మార్గనిర్దేశం చేసి, అనేక ముఖ్యమైన ఆవిష్కరణలకు దోహదపడ్డారు.
1933 జనవరిలో నాజీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, మ్యాక్స్ బోర్న్ యూదుడు కావడం వల్ల ఆయన్ను యూనివర్సిటీ నుంచి తీసేశారు. 1935లో ఆయన బెంగళూరుకు వచ్చి సి.వి.రామన్ ప్రతిపాదనను అంగీకరించారు. బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సీటుకోసం ఆయన ప్రయత్నించారు. కానీ సీటు రాకపోవడంతో ఆయన తిరిగివెళ్ళిపోయారు.
జర్మనీలో ఉన్న పరిస్థితి కారణంగా బోర్న్ జర్మనీ పౌరసత్వాన్ని వదిలిపెట్టారు. ఆ తరువాత ఆయన ఇంగ్లాండ్ కు వలస వెళ్లిపోయారు. అక్కడ ఆయన ఎడింబర్గ్ విశ్వవిద్యాలయంలో దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ప్రొఫెసర్ గా పనిచేశారు.
1954 లో పదవీ విరమణ చేసిన తరువాత, మాక్స్ బోర్న్ జర్మనీలోని గొట్టింజెన్ కు తిరిగివచ్చారు. ఆయన జనవరి 5, 1970 న మరణించాడు.
క్వాంటం ఫిజిక్స్ అంటే ఏమిటి?
అణువు యొక్క చిన్న భాగం. క్వాంటం యాంత్రిక భౌతికశాస్త్రం యొక్క ఒక అధ్యాయం. ఇది కణజాల స్థాయిలో కణ అధ్యయనాన్ని అధ్యయనం చేస్తుంది. 'క్వాంటం ఫిజిక్స్' కారణంగా వ్యక్తిగత కంప్యూటర్, లేజర్, మెడికల్ ఇమేజింగ్ పరికరాలు (MRI) వంటి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు ఆవిష్కరించబడ్డాయి.