Google Trend Video: Biker superbly escaped from the police: పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు దొంగలు అనేక ఎత్తులు వేస్తుంటారు. ఇక బైక్ దొంగలు అయితే అంతకు మించి ఉంటారు. దొరికిన తర్వాత కూడా పారిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కొన్ని సార్లు పోలీసులను భలేగా బురిడీ కొట్టి పారిపోతారు. ఇటువంటి సంఘటనకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధూమ్‌ సినిమా దాదాపుగా అందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో దొంగ అయిన జాన్ అబ్రహం.. పోలీస్ ఆఫీసర్ అభిషేక్ బచ్చన్ నుంచి సునాయాసంగా తప్పించుకుంటాడు. అలా దొరికినట్టే దొరికి.. చిక్కకుండా తప్పించుకుపోతాడు. అచ్చు జాన్ అబ్రహం మాదిరే.. పోలీసులను భలేగా బురిడీ కొట్టిస్తాడు ఓ బైక్ దొంగ. ఈ వీడియోను ఘంటా అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయింది. ఈ వీడియో చూస్తే బైకర్‌కి జాన్‌ అబ్రహం కూడా ఫిదా అవుతాడు. 


వీడియో ప్రకారం... ముందు బైక్‌ దొంగ ఓ స్కూటీపై రోడ్డుపై వేగంగా వెళుతున్నాడు. ఆ వెనకాలే ఇద్దరు పోలీసులు అతడిని పట్టుకోవడానికి వెళుతున్నారు. ఉన్నటుంది బైక్‌ దొంగ వేగం తగ్గించి రోడ్డుపై ఆగిపోతాడు. వెనకాలే వచ్చిన పోలీసులు తమ బండిని ఆపి.. పట్టుకునే లోపు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుని రేస్ పెంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో వచ్చిన మరో పోలీస్ అతడిని పట్టుకునే క్రమంలో కిందపడిపోతాడు. ఇంకేముంది దొంగ ఎంచక్కా తప్పించుకుంటాడు. 



ఈ వీడియోను ఘంటా అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయింది. 'ఈ లెజెండ్‌కు పెద్ద నమస్కారం' అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో క్లిప్‌ చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది నెటిజన్లు బైకర్‌ను ప్రశంసిస్తున్నారు. సూపర్ బైకర్, భలే తప్పించ్చుకున్నాడే, బైకర్‌కి జాన్‌ అబ్రహం కూడా ఫిదా అవుతాడు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 


Also Read: Watermelon: పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టుకుని తింటున్నారా..ఈ దుష్ప్రభావాలు తప్పవు..!!


Also Read: Divyavani Resign: టీడీపీకి దివ్య వాణి రాజీనామా..త్వరలో ఆ పార్టీ గూటికేనా..! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook