Groom Dance in Open Audi Car: ప్రతి ఒక్కరి జీవితంలో 'పెళ్లి' అనేది చాలా ప్రత్యేకం. అందుకే ప్రతి ఒక్కరు తమ పెళ్లిని ఒక మెమోరబుల్ మూమెంట్‌గా మార్చుకోవడం కోసం చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే పెళ్లిలలో డీజేలు పెట్టి.. డ్యాన్సులు చేస్తూ ఉంటారు. పెళ్లికి ముందు రోజు నుంచి మొదలయ్యే డీజేల సందడి రెసెప్షన్ వరకు ఉంటుంది. పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె డ్యాన్స్‌ చేసి ఆనందపడుతుంటారు. అయితే ఇంట్లో, మండపాల్లో కాకుండా ఓ పెళ్లి కొడుకు రోడ్డుపై డాన్స్ చేసి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో రద్దీగా ఉండే రోడ్డులో ఓ వరుడు తన స్నేహితులతో కలిసి ఓపెన్ టాప్ కారులో వెళుతూ డ్యాన్స్ చేశాడు. ఎరుపు రంగు ఆడి కారులో వెళుతూ స్టెప్పులు వేశాడు. ఇక వరుడి స్నేహితులు వెనకాల కార్లలో వెళుతూ.. కిటికీల నుంచి బయటకి వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ డ్యాన్స్ చేశారు. కదులుతున్న కార్లలో డ్యాన్స్ చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అంకిత్ కుమార్ అనే ఓ ప్రయాణికుడు ఈ తతంగాన్ని వీడియో తీసి ముజఫరానగర్ పోలీసులకు సమాచారం అందించాడు. 


'హరిద్వార్ నుంచి నోయిడాకు వెళ్తున్న‌ నా ప్రయాణంలో ఓ ఘటన జరిగింది. ముజఫర్‌నగర్ జిల్లాలో కొంతమంది తమ వినోదం కోసం ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. వరుడు తన స్నేహితులతో కలిసి ఓపెన్ టాప్ కారులో వెళుతూ డ్యాన్స్ చేస్తూ నానా హంగామా చేశాడు. ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాను' అని అంకిత్ కుమార్ వీడియోకి ఇలా రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.



ముజఫరానగర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ యాదవ్ ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేసి.. సదరు వరుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియోలో ఉన్న నంబర్ ప్లేట్ ఆధారంగా తొమ్మిది వాహనాలను గుర్తించిన పోలీసులు.. వారికి ఫైన్ వేశారు. తొమ్మిది వాహనాలకు కలిపి రూ.2 లక్షల వరకు చలాన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఈ మ్యాటర్ నెట్టింట వైరల్ అయింది. 


Also Read: టాలీవుడ్ యువ హీరోతో 'డీజే టిల్లు' హీరోయిన్‌ రొమాన్స్.. త్వరలోనే..!


Also Read: Nayanthara Conditions: నయనతార కొత్త కండీషన్‌.. ఇకపై సినిమా అవకాశాలు వచ్చేనా



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook