Google Trend Video, Squid Fish changing its colour from black to white in water: ఈ ప్రపంచం మొత్తం రహస్యాలతో నిండి ఉంది. భూమి నుంచి సముద్రం వరకు మిలియన్ల జీవులు రహస్యంగా జీవిస్తుంటాయి. ఒక్కోసారి కొన్ని జీవులు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి ఓ జీవిని చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఊసరవెల్లిలా రంగు మార్చే చేపకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది నిజామా కాదా అని ఆలోచించేలా చేస్తోంది. అసలు విషయంలోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్విట్టర్ ఖాతా 'ఫిగెన్'లో ఓ చేపకు సంబందించిన వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రకారం.. నీటిలో అర చెయ్యి సైజులో ఓ స్క్విడ్‌ చేప ఈదుతోంది. ఓ వ్యక్తి దాన్ని రెండు అర చేతులతో నీటిలోంచి పైకి తీశాడు. వెంటనే అది తెల్లగా (పారదర్శకంగా) మారిపోయింది. ఇందులో మాయ ఏదీ లేదు అని చెప్పేందుకు.. ఆ వ్యక్తి చేపను మళ్లీ నీటిలో వదిలాడు. వెంటనే అది నల్లగా మారిపోయింది. మరోసారి బయటికి తీయగా.. తెల్లగా మారుతుంది. ఆపై నీటిలో వేయగా నల్లగా మారుతుంది. 


ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసి చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది అదేంటి అలా మారుతోంది అని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు విచిత్రంగా ఉంది అని ట్వీట్ చేస్తున్నారు. 'నాకు అలాంటిది కావాలి', 'భలే ఉందే ఈ చేప' అని కామెంట్ల వర్షం కురుస్తోంది. గ్లాస్ కారణంగానే అది నల్లగా మారుతుందని కొందరు ట్వీట్లు పెడుతున్నారు. 



క్రాంచిడే జాతి చేప కుటుంబంలో దాదాపు 60 రకాల గ్లాస్ స్క్విడ్‌లు ఉన్నాయి. ఈ చేపల పొడవు 10 సెంటీమీటర్ల నుండి 3 మీటర్ల వరకు అంటాయి. ప్రతిఒక్కటి కూడా చాలా వెరైటీగా ఉంటాయి. అందులో ఒకటే ఈ చేప అట. మనం నిత్యం చూసే చేపల్లో కూడా చాలా రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇంతకీ ఆ చేప రంగు మారడం నిజమేనా? లేదా గ్లాస్ కారణంగా మారుతుందా? తెలియాల్సి ఉంది. 


Also Read: Niharika Konidela: భర్తకు నిహారిక లిప్‌లాక్‌.. రెచ్చిపోయిన నెటిజన్లు!


Also Read: Arms Smuggling Case: పాకిస్థాన్ నుంచి ఆదిలాబాద్‌కి ఆయుధాల తరలింపు కేసులో లేటెస్ట్ అప్‌డేట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.