Trending today: సాధారణంగా పండుగ సమయాల్లో బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో కిక్కిరిసి పోతాయి. దీంతో ఎలాగైనా అనుకున్న గమ్యానికి చేరుకోవాలని ప్యాసింజర్స్ ఖాళీ లేకపోయినా కిటికీ అద్దాల నుంచో, మరే విధంగానో బస్సు లేదా ట్రైన్స్ లోకి రిస్క్ చేసి మరి ఎక్కుతారు. ఇలాంటి సీన్స్ బస్సుల్లో కామన్ గా చూస్తుంటాం. అయితే ఈ సారి దీనికి రివర్స్ లో కొందరు రైలులోకి విండోస్ ద్వారా ప్రవేశించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ఓపెన్ చేస్తే... ఉజ్జయిని రైల్వే స్టేషన్ లో ట్రైన్ కోసం ప్యాసింజర్స్ ఎదురుచూస్తున్నారు. ఆ స్టేషన్ లో ప్లాట్ ఫామ్స్ మీద వందల మంది ప్రయాణికులు ఉన్నారు. ఇదే సమయంలో ఓ ట్రైన్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా ట్రైన్ ఎక్కేందుకు ఎగబడ్డారు జనాలు. డోర్లు దగ్గర ఎక్కువ మంది జనాలు ఉండటంతో... కొందరు కిటికీల ద్వారా రైలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా అమ్మాయిలు ఎంతో రిస్క్ చేసి విండోస్ ద్వారా కోచ్‌లలోకి ప్రవేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. 



Also Read: Trending Video: ఐడియా అదిరిపోయింది గురూ.. గుర్రంపై ఫుడ్ డెలివరీ.. ఈ వ్యక్తి మాములోడు కాదు..!


ఈ షాకింగ్ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కిటికీల ద్వారా కోచ్‌లలోకి ప్రవేశించడం చాలా ప్రమాదకరమా అని కొందరు అంటుంటే.. మరికొందరు భారతీయ రైల్వే ట్విట్టర్ ప్రొఫైల్‌ను ట్యాగ్ చేశారు. కిటికీలంటే చిన్న తలుపులే కదా మరో యూజర్ వ్యాఖ్యానించాడు. ఈ రద్దీకి కారణం ట్రక్ డ్రైవర్లు కొత్త 'హిట్-అండ్-రన్' చట్టాలను తీవ్రంగా పరిగణించడాన్ని నిరసిస్తూ ప్రారంభించిన సమ్మె. దీని ప్రభావం ఉజ్జయినిలో ఎక్కువగా కనిపించింది. అక్కడ బస్సులు అందుబాటులో లేకపోవడంతో వేలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. టాక్సీ మరియు ఆటో-రిక్షా డ్రైవర్లు సమ్మెకు తమ మద్దతును ప్రకటించడంతో పరిస్థితి మరింత దిగజారింది, దీంతో వారంతా రైళ్లు ఎక్కంతా ఎగబడ్డారు. 


Also Read: Teacher Student Photoshoot: స్టూడెంట్‌తో టీచర్ రొమాంటిక్ ఫోటోషూట్.. ఇంటర్‌నెట్‌లో పిక్స్ లీక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి