Girl Winks to boy video viral: హిందూ వివాహ వ్యవస్థలో పెళ్లి అనే క్రతువు చాలా పెద్ద ప్రక్రియ. వీరి వివాహ వేడుకలో నిశ్చితార్థం మెుదలు పెళ్లి వరకు ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ కమ్యూనిటీలో పెళ్లి సంబంధాలు ఎక్కువగా దగ్గరి బంధువుల నుంచో, తెలిసిన వారి ద్వారానో, పెళ్లిళ్ల పేరయ్య ద్వారానో కుదురుస్తుంటారు. పెళ్లికి(Marriage) ముందు అబ్బాయి కుటుంబ సభ్యులు అమ్మాయి ఇంటికి, అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటికి వెళ్లడం అనేది ఆచారంగా వస్తుంది. ఇవ్వన్నీ కుదిరితే ఇరు కుటుంబాల నిశ్చితార్థం చేసుకుంటాయి.  వివాహనికి ముందు ఎంగేజ్ మెంట్ అనేది చాలా ముఖ్యమైన క్రతువు. ఈ నిశ్చితార్థ సమయంలో కాబోయే వధువరులు కొన్ని చిలిపి పనులు చేస్తుంటారు. ఒకరినొకరు సైలెంట్ గా చూసుకోవడం, కళ్లతో సైగలు చేసుకోవడం, మాట్లాడుకోవడం వంటివి చేస్తుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలాంటి రొమాంటిక్ సీన్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అబ్బాయి కుటుంబం నిశ్ఛితార్థం(Engagement)  కోసం అమ్మాయి ఇంటికి వస్తుంది. అబ్బాయి కుర్చీలో కూర్చుని ఉండగా.. అమ్మాయి పక్కనే నిలబడి ఉంటుంది. ఇంతలో ఆ అబ్బాయి అమ్మాయివైపు చూడగా.. మెుదట ఆమె ముద్దుపెడుతున్నట్లు చేసింది. ఆ తర్వాత రొమాంటిక్ గా కన్ను కొట్టింది. ఆమె చేసిన పనికి అబ్బాయితో సహా అక్కడ ఉన్నవారందరు నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోకు విపరీతమైన లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.  ఇప్పటి వరకు ఈ వీడియోను 3 కోట్ల మందికిపైగా వీక్షించగా.. 18 లక్షల మందికిపైగా లైక్ చేశారు. చాలా క్యూట్ గా ఉందని, ఆ కుర్రాడి హృదయం బద్దలైందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 




Also Read: Leopard: ఎరక్కపోయి ఇరుక్కుపోయిన చిరుత పులి.. నీళ్లు తాగుతూ రాగి బిందెలోకి ఇరుక్కున్న పులి తల


Also Read: Viral Video: ఇది మామూలు వింత కాదు రా బాబు.. సెలూన్‌లో గడ్డం గీయించుకున్న యువతీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి