Heart Touching Video: అన్నీ పొందాలనుకోవడం కంటే.. పొందినవాటిలో కొంత ఇతరులతో పంచుకుంటే నిజమైన ఆత్మ సంతృప్తి లభిస్తుంది. అలాంటి సహృదయత కొందరికే ఉంటుంది. తాజాగా ఓ చిన్నారి వీధి బాలుడి పట్ల చూపించిన ప్రేమ, సహృదయతకు సంబంధించిన ఓ వీడియో నెటిజన్ల హృదయాలను తాకుతోంది. 59 సెకన్ల నిడివి గల ఆ వీడియోలో ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ఎంత ప్రేమపూర్వకంగా వ్యవహరించారో చూస్తే కళ్లు చెమ్మగిల్లకుండా ఉండలేవు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వీడియోలో.. రోడ్డుపై ఆగిన ఓ కారును వీధి బాలుడు ఒకరు తుడవడం గమనించవచ్చు. ఇంతలో కారు విండో తెరిచిన అందులోని బాలుడు.. ఆ వీధి బాలుడికి ఓ టాయ్‌ని ఇచ్చాడు. ఆ టాయ్‌ని చూడగానే సంతోషించిన వీధి బాలుడు.. దాన్ని చేతుల్లోకి తీసుకుని.. అక్కడే రోడ్డుపై కొద్ది సెకన్ల పాటు దానితో ఆడుకున్నాడు. ఆ వెంటనే దాన్ని తిరిగి ఇచ్చేయబోయాడు. అయితే కారులో ఉన్న బాలుడు దాన్ని తీసుకునేందుకు నిరాకరించాడు.


ఆ టాయ్‌ని నీ వద్దే ఉంచుకోమని ఆ బాలుడితో చెప్పాడు. అందుకు కృతజ్ఞతగా ఆ వీధి బాలుడు.. అక్కడి నుంచి పరిగెత్తుకెళ్లి క్షణాల్లో ఓ స్నాక్స్ ప్యాకెట్‌తో ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరు కలిసి ఆ స్నాక్స్‌ని షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కారు అక్కడి నుంచి కదలడంతో.. ఆ ఇద్దరు చిన్నారులు ఒకరికొకరు చేతులు ఊపుకుంటూ టాటా చెప్పుకున్నారు. హార్ట్ టచింగ్‌గా ఉన్న ఈ వీడియో ఎంతోమంది నెటిజన్లను కదిలిస్తోంది. వీడియో చూశాక.. కళ్ల నీళ్లు పెట్టుకోకుండా ఉండలేకపోతున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఇది పాత వీడియోనే. ఎవరో నెటిజన్ దీన్ని షేర్ చేయడంతో సోషల్ మీడియాలో మరోసారి చక్కర్లు కొడుతోంది. 



Also Read: Bandla Ganesh Audio Leak: త్రివిక్రమ్ నన్ను రావొద్దంటున్నాడు.. 'భీమ్లా నాయక్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై బండ్ల గణేష్ సంచలన కామెంట్స్..


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook