Video of Mother Rat saves baby from snake: ఈ లోకంలో తల్లి ప్రేమను మించిన ప్రేమత్వం మరొకటి లేదు. కడుపున పుట్టిన తన ప్రతిరూపాన్ని కంటికి రెప్పలా కాచుకుంటుంది తల్లి. బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూ తనే సర్వస్వంగా బతికే తల్లులు ఎంతోమంది. బిడ్డకు ఏ ఆపద వచ్చినా వారు తల్లడిల్లిపోతారు. అవసరమైతే తమ ప్రాణాలను అడ్డుపెట్టయినా బిడ్డ ప్రాణాలను కాపాడాలనుకుంటారు. తల్లి ప్రేమకున్న ఈ గొప్పతనం కేవలం మనుషుల్లోనే కాదు సమస్త జీవ జాతుల్లో ఉంటుంది. అందుకు ఈ వీడియోనే (Animal Viral Video) సరైన ఉదాహరణ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వీడియోను గమనిస్తే.. ఓ విష సర్పం పిల్ల ఎలుకను నోట కరిచి పొదల్లోకి వెళ్లేందుకు వేగంగా ముందుకు కదులుతోంది. ఇంతలో ఎక్కడి నుంచి గమనించిందో కానీ... ఆ ఎలుక తల్లి అక్కడ ప్రత్యక్షమైంది. ఆ పాముతో కలబడినంత పనిచేసింది. పాము తోకను లాగుతూ.. దాన్ని ముప్పుతిప్పలు పెట్టి... మొత్తానికి అక్కడి నుంచి జారుకునేలా చేయగలిగింది. ఎలుక ప్రతాపానికి (Rat fight with Snake) జడుసుకుని.. ఆ చిట్టెలుకను పాము అక్కడే వదిలి పొదల్లోకి పారిపోయింది. 


ఆపై తన పిల్లను నోట కరిచి.. దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది తల్లి ఎలుక. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐఎఫ్ఎస్ అధికారి సురేంద్ర మెహ్రా తన ట్విట్టర్ పేజీలో ఈ వీడియోను (Viral Video) షేర్ చేశారు. ఇప్పటివరకూ 24వేల పైచిలుకు మంది ఈ వీడియోను వీక్షించారు. విష సర్పమని తెలిసి కూడా.. తన బిడ్డ కోసం దానితో కలబడ్డ తల్లి ఎలుకపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించింది మరొకటి లేదని... ఈ వీడియోతో మరోసారి రుజువైందని ఓ నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం. 



Also Read: Padma Shri: పద్మ శ్రీ ప్రకటనపై గరికిపాటి నరసింహారావు ఆనందం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook