King Cobras fighting video: ఆడ నాగు కోసం రెండు మగ నాగులు భీకరంగా పోట్లాడిన వీడియో ఒకటి యూట్యూబ్‌లో వైరల్‌ అవుతోంది. ఆడ సర్పాన్ని ఆకర్షించే క్రమంలో ఆ రెండు సర్పాలు దాదాపు ఐదు గంటల పాటు తలపడ్డాయి. ఒకదానిపై ఒకటి బుసలు కొడుతూ కాటేసుకున్నాయి. రెండింటి మధ్య జరిగిన పోరులో చివరకు ఒక మగ నాగు అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో అక్కడున్న నాగుకు ఆడ నాగుతో కలిసేందుకు లైన్ క్లియర్ అయినట్లయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డాక్యుమెంటరీ వీడియో :


స్మిత్‌సోనియన్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఈ డాక్యుమెంటరీ వీడియోను అప్‌లోడ్ చేశారు. ఇండియాలోని ఓ ఫారెస్ట్‌లో దీన్ని షూట్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటివరకూ 2 లక్షల వ్యూస్ వచ్చాయి. దాదాపు ఐదు గంటల పాటు రెండు పాముల మధ్య జరిగిన పోరును తక్కువ నిడివితో ఇందులో చూపించారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 


రెండు పాములు అంతలా తలపడుతుంటే... పక్కనే ఉన్న కోళ్లు ఏమాత్రం బెదరకుండా ఉండటం ఆశ్చర్యం కలిగించిందని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. మరికొందరు నెటిజన్లు.. అది సర్పాల మధ్య ఫైటింగ్ కాదని.. కలయిక అని కామెంట్స్ చేశారు. అసలు ప్రకృతి ఎందుకిలా చేస్తుంది.. ఆడ నాగుతో కలయిక కోసం మగ నాగులే ఎందుకు పోట్లాడుకోవాలని ఓ నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం.



Also Read: Alia Bhatt Marriage: మా పెళ్లి ఎప్పుడో అయిపొయింది.. బాంబు పేల్చిన ఆలియా భట్‌!!


Also Read: DJ Tillu: విజయ్ దేవరకొండను కాపీ కొడుతున్నారా.. హీరో సిద్ధు జొన్నలగడ్డ రియాక్షన్ ఇదే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook