Groom Firing in Wedding Procession: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది.పెళ్లి ఊరేగింపు సందర్భంగా వరుడు గన్‌తో గాల్లోకి కాల్పులు జరపగా.. ఆ బుల్లెట్ తన మిత్రుడికి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్‌లోని సోనభద్ర జిల్లా బ్రహ్మనగర్ ప్రాంతంలో ఇటీవల మనీష్ మధేషియా అనే యువకుడి పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం ఊరేగింపుగా బరాత్ నిర్వహించారు. బంధుమిత్రులంతా ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ వరుడి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో ఒకచోట వరుడు గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ బుల్లెట్ కాస్త అతని స్నేహితుడైన బాబూ లాల్ యాదవ్‌కి తగలడంతో అతను తీవ్రంగా గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.


వరుడు గాల్లోకి కాల్పులు జరిపిన ఆ గన్ బాబూ లాల్ యాదవ్‌దే కావడం గమనార్హం. యాదవ్ మృతితో పెళ్లింట ఒక్కసారిగా విషాదం అలుముకుంది. మృతుడు బాబూ లాల్ కుటుంబ సభ్యులు వరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు. గన్ లైసెన్స్ ఉన్నా సరే.. ఇలా వేడుకల కోసం గాల్లోకి కాల్పులు జరపడం చట్టరీత్యా నేరమని స్థానిక ఎస్పీ అమరేంద్ర ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. వరుడి కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 




Also Read: Maharashtra Political Crisis: ఉద్ధవ్ ఠాక్రేకి షాక్‌ల మీద షాక్‌లు.. ఎమ్మెల్యేలే కాదు రెబల్ బాటలో 14 మంది ఎంపీలు..?


Also Read: Group Jobs: నిరుద్యోగులకు బంపరాఫర్.. అన్ని పోస్టులకు  ఒకే నోటిఫికేషన్‌!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.