Funny Video Viral: సోషల్ మీడియాలో (Social Media) రోజూ ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. కరోనా (Covid-19) పుణ్యమా అని చాలా మంది ఇంటి నుంచే ఉద్యోగులు చేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా వర్క్ ఫ్రం హోం  లోనే కొనసాగుతున్నారు. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ఆఫీసులు తెరుచుకుంటున్నాయి. చాలా మందికి ఇంటి నుంచి పని అలవాటు అయి... ఇంటి దగ్గర ఉన్నట్టే ఆఫీసులోనూ ప్రవర్తిస్తున్నారు.  తాజాగా ఇలాంటి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


వీడియో ఓపెన్ చేస్తే... ఒక ఆఫీసులో కొంత మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. ఇందులో ఓ ఉద్యోగి సడన్ గా వర్క్ ఫ్రం హోం (Work from home)లో ఉన్నట్లుగా 'మమ్మీ చాయ్' అంటూ బిగ్గరగా అరుస్తాడు. దీంతో అక్కడున్న వారందరూ షాక్ కు గురి అయి.. ఆ వ్యక్తి వంక చూశారు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను (Office Video) చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 2,500 మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తెగ సెటైర్లు వేస్తున్నారు.


Also Read: Trending Video: దమ్ము కొడుతున్న ఒరంగుటాన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook