OMG video: పెద్ద పులితో పరాచకాలు ఆడిన కుక్క.. చివరకు ఏమైందంటే?
Trending video today: ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వీధి కుక్క పెద్దపులిని కెలికి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
Viral Video today: సోషల్ మీడియా వచ్చాక ప్రపంచం చిన్నదైపోయింది. ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వీటినే నెటిజన్స్ కూడా ఎక్కువగా చూస్తున్నారు. ఈ మధ్య పాములు, పులుల వీడియోలకు మాంచి వ్యూస్ వస్తున్నాయి. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో పడుకున్న పెద్దపులిని గెలికి ప్రాణాల మీదకు తెచ్చుకుంది ఓ కుక్క.
భూమ్మిద క్రూరమైన జంతువుల్లో పెద్ద పులి ఒకటి. ఇతర జంతువులపై సింహం తర్వాత దీని డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక కుక్కను విశ్వాసానికి ప్రతీకగా పిలుస్తారు. చాలా మంది డాగ్స్ ను పెంచుకుంటారు. ఇవి ఇతరుల నుంచి మనుషులతోపాటు ఇంటిని కూడా రక్షిస్తాయి. సాధారణంగా వీధి కుక్కలు కుదురుగా ఉండవు, ఏదోక దానిని గెలికుతూ ఉంటాయి. తాజాగా ఓ కుక్క అలానే చేసి పులికి బలైంది.
వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో ఓ పెద్ద పులి హాయిగా నిద్రపోతూ ఉంటుంది. అటువైపు నుంచి వెళ్తున్న కుక్క దానిని చూసి పారిపోవాల్సిందే పోయి అక్కడే నిలబడి చూస్తుంది. దానిని అలికిడికి పులికి తెలివి వస్తోంది. అయినా సరే కుక్క పారిపోకుండా పులి పైకి దూసుకెళ్తోంది. దీంతో తీవ్ర అగ్రహనికి గురైన పులి.. కుక్క మెడను పట్టుకుని కొన్ని సెకన్ల వ్యవధిలోనే చంపేస్తోంది. అనంతరం దానిని పట్టుకుని పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ వీడియోను ఐఆర్‌ఎస్ అధికారి అంకుర్ తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేశాడు. రాజస్థాన్ లోని రణతంబోర్ పార్క్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మీరు ఓ లుక్కేయండి.
Also Read: Leopard: ఎరక్కపోయి ఇరుక్కుపోయిన చిరుత పులి.. నీళ్లు తాగుతూ రాగి బిందెలోకి ఇరుక్కున్న పులి తల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook