Delhi Metro Viral Videos: ఢిల్లీ మెట్రో రైల్లో సీటు కోసం ఇద్దరి మహిళల మధ్య వివాదం తలెత్తింది. దీంతో వారిలో ఒకరు వేరేవారిపై పెప్పర్‌ స్ప్రే కొట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంంబంధించిన వీడియోను బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గా ఏప్రిల్ 2న ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 5 లక్షల మందికిపైగా వీక్షించారు. ఈ వీడియోలో ఇద్దరు మహిళలు ఒకరినొకరు దూషించుకోవడం కనిపించింది. కానీ గొడవ ఎందుకు జరిగిందో స్పష్టంగా తెలియలేదు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియోలోకి వెళితే... మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు ఒకే సీటులో కూర్చున్నారు. వీరిద్దరిలోని ఓ యువతి తొటి ప్రయాణికురాలిని తీవ్రంగా తిడుతూ కనిపించింది. కాసేపటికి వీరి గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో యువతి పెప్పర్ స్ప్రే తీసుకుని ఆ వుమెన్ పై కొట్టింది. ఆమె ఆపడానికి ఎంత ప్రయత్నించినప్పటికి ఆ యువతి కొడుతూనే ఉంది. ఆ పెప్పర్ స్పై వాసన కంపార్ట్‌మెంట్‌ అంతా వ్యాపించడంతో ఆ ఘాటుకు ప్యాసింజర్స్ ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.


నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, పెప్పర్ స్ప్రేలో ఒలియోరెసిన్ క్యాప్సికమ్ (OC) అనే క్రియాశీల ఏజెంట్ ఉంటుంది. ఇది క్యాప్సికమ్ జాతికి చెందిన మొక్కల నూనెతో తయారు చేస్తారు. దీనిని మహిళలు తమ స్వీయ రక్షణ కోసం వినియోగిస్తూంటారు. ఢిల్లీ మెట్రో రైలులో తీసుకెళ్లడానికి నిషేధించబడిన వస్తువుల జాబితాలో పెప్పర్ స్ప్రేని పేర్కొనలేదు. 


Also Read: Oldage Woman Stops Train: భారీ రైలు ప్రమాదాన్ని నివారించేందుకు రైలుకు ఎదురెళ్లిన బామ్మ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook