Viral Video today: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎవరికి వారు తమ టాలెంట్ ను చూపించుకునే పనిలో పడ్డారు. అంతేకాకుండా డిఫరెంట్ వీడియోలు పోస్ట్ చేస్తూ.. నెట్టింట ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. వీరు చేసే చిత్రవిచిత్ర పనులు కొన్న సార్లు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని సార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. జనాలు కూడా ఏదైనా వింతగా, డిఫరెంట్ గా ఉంటేనే చూస్తున్నారు. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, షేర్ చాట్ వంటి సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక నెటిజన్స్ తెలివి మరీ ఎక్కువైపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా మనం బట్టలు ఐరన్ చేసేటప్పుడు ఇస్త్రీ పెట్టెను ఉపయోగిస్తాం, కొందరైతే పాతకాలపు పద్దతులైన మర చెంబుతో ఇస్త్రీ చేయడం చేస్తూంటారు. కానీ తాజాగా ఓ యువతి కుక్కర్‌తో ఇస్త్రీ చేసి అందరి చూపులు తనవైపు తిప్పుకుంది. ఈమె తెలివి మామూలుగా లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. 



వీడియో ఓపెన్ చేస్తే.. ఓ మహిళ గ్యాస్ మీద వంట చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా అదే టైంలో బట్టలు ఇస్త్రీ చేయాలని అనుకుంటుంది. కరెంటు బిల్ల ఎక్కువ వచ్చేస్తుందని భయపడిందో ఏమో గానీ.. చివరికి పొయ్యి మీద పెట్టిన కుక్కర్‌తో ఇస్త్రీ చేద్దామనే నిర్ణయానికి వస్తుంది. గ్యాస్ మీద పెట్టిన కుక్కర్ బాగా వేడెక్కి విజిల్ రాగానే.. స్టవ్ నుంచి దింపి.. అప్పటికే ఇస్త్రీ చేద్దామని రెడీగా పెట్టుకున్న చొక్కాను ఎంచెక్కా ఇస్త్రీ చేసేస్తోంది. దీంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. ఒక పక్క వంట పని..మరో పక్క ఇస్త్రీ కూడా అయిపోయింది. నెట్టింట ట్రెండ్ అవుతున్న ఈ వీడియోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోను లక్ష మందికిపైగా వీక్షించారు. 


Also Read: Shiraz Vlogger: యూట్యూబ్‌ మెచ్చిన పాకిస్థాన్‌ బుడ్డోడి కిర్రాక్‌ వీడియోలు.. చూస్తే నవ్వకుండా ఉండలేరు


Also Read: Viral Video today: ఇదెక్కడి దిక్కుమాలిన ప్రేమ రా బాబు.. రన్నింగ్ కారులో వేలాడుతూ సరసాలా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి