Drunk Groom Sleeps At His Own Wedding: అక్కడ పెళ్లిలో బంధువుల హడావుడి.. బ్యాండ్ మేళాల సందడి నెలకొంది. వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పండితుడు వేదా మంత్రాలను చదువుతున్నాడు. మరి కాసేపట్లో వధువు మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉంది. అయితే పండితుడు చెబుతున్న మంత్రాలను వరుణు వినే పరిస్థితిలో లేడు. ఫుల్‌గా మద్యం తాగి వచ్చి పెళ్లి పీటలపైనే గురకపెట్టి నిద్రపోయాడు. దీంతో వధువు పెళ్లి పీటలపై నుంచి లేచి వెళ్లిపోయింది. ఈ ఘటన అస్సాంలోని నల్బరీ జిల్లాలో చోటు చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నల్బరి పట్టణానికి చెందిన వరుడు ప్రసేన్‌జిత్ హలోయ్‌కు ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే వివాహానికి కారులో నుంచి దిగిన వరుడు.. ఫుల్ మద్యం సేవించి వచ్చాడు. మద్యం మత్తులో ఊగుతూ.. మండపంలో నడుచుకుంటూ వచ్చాడు. వరుడితోపాటు అతని బంధవులు కూడా దాదాపు అందరూ కూడా మద్యం సేవించి మండపానికి వచ్చారు.


వరుడిని చూసి ఆగ్రహంతో వధువు పెళ్లి పీటలపై కూర్చొనని స్పష్టం చేసింది. అయితే బంధువులు అంతా ఆమెను ఒప్పించడంతో వరుడి పక్కన కూర్చొంది. పండితుడు మంత్రాలు చెబుతున్న నేపథ్యంలో వరుడు గురకపెట్టి నిద్రపోయాడు. దీంతో వధువుకు చిరెత్తుకొచ్చి అక్కడి నుంచి లేచి పోయింది. అతడిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. పెళ్లి కొడుకు తీరుపై వధువు బంధువులు గ్రామ పెద్దలను ఆశ్రయించారు. అనంతరం పెళ్లికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నల్బరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 


“పెళ్లికి ఏర్పాట్లు భారీగా చేశాం. బంధవుల కోలహాలంతో పెళ్లి మండపం కళకళలాడుతున్న సమయంలో వరుడుతో పాటు బంధువులు మద్యం సేవించి వచ్చారు. అయితే పెళ్లిని పూర్తి చేసేందుకు మా కుటుంబం చాలా ప్రయత్నించింది. కానీ పరిస్థితి విషమించడంతో అమ్మాయి పెళ్లికి ఒప్పుకోలేదు. వరుడి కుటుంబంలో 95 శాతం మంది మద్యం తాగి ఉన్నారు. మేం పోలీసులకు ఫిర్యాదు చేశాం..” అని వధువు బంధువులలో ఒకరు చెప్పారు. వరుడు కారులోంచి కూడా దిగలేకపోయాడని.. అతని తండ్రి కూడా మత్తులో ఉన్నాడని తెలిపారు.


Also Read: MLC Kavitha: ఊహగానాలకు చెక్.. ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ  


Also Read: Shubman Gill: శుభ్‌మన్ గిల్ సెంచరీ.. కేఎల్ రాహుల్ సర్దుకోవాల్సిందేనా..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook