Viral video: ముంబైలో వర్షం బీభత్సం... రైలు పట్టాలపై తిరుగుతున్న చేపలు.. వీడియో వైరల్..
Rains in mumbai: ముంబైలో కొన్నిరోజులుగా భారీగా వర్షం కురుస్తుంది. దీంతో సాధారణ జన జీవనమంతా అస్తవ్యస్తంగా మారిపొయింది. రోడ్డుపైన ఎక్కడ చూసిన ట్రాఫిక్ సమస్య నెలకొంది. ప్రస్తుతం ముంబైకు వానలకు సంబంధించిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Fishes swimming near Mumbai railway platform: కొన్నిరోజులుగా రుతుపవనాలు దేశంలో జోరుగా విస్తరించాయి. దీనితో పాటు ఉపరితల ద్రోణి ప్రభావం కూడా తోడుకావడంతో వర్షాలు భారీగా వర్షం కురుస్తుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై వర్షాలతో అతలాకుతలం అవుతుంది. ఎక్కడ చూసిన కూడా రోడ్లన్ని నీళ్లతో జలమయమైనాయి. సాధారణ జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రజలు బైటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ముంబైలో రైలు ప్రయాణం నరకంగా ఉంటుందని ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు. వందల మంది లోకల్ ట్రైన్ లలో కిక్కిరిసిపోయి ప్రతిరోజు ప్రయాణిస్తుంటారు.
మరోవైపు రోడ్లపై నీరు ఆగిపోవడం వల్ల ప్రజారవాణాకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా.. ముంబైలోని కొన్ని ఏరియాల్లో తమ ఇళ్లకు నీళ్లు చేరుకున్నాయని కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడి, నీళ్లు నిలిచిపోవడం వల్ల.. మంచి నీరు కూడా పలు చోట్ల కలుషితమౌతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముంబైలో ఎక్కడ చూసిన నీళ్లే కన్పిస్తున్నాయి. కొన్ని రైల్వేస్టేషన్ లలో ప్లాట్ ఫామ్ లు, రైలు పట్టాల్లో కూడా నీళ్లు వచ్చి చేరాయి. దీనికి సంబంధిచిన ఒక వీడియో మాత్రం వైరల్ గా మారింది.
ముంబైలో కురుస్తున్న వర్షం జోరుకు పట్టాల మీద కూడా నీళ్లు వచ్చిచేరాయి. ఇప్పటి వరకు వర్షం పడితే.. రోడ్ల మీద మొసళ్లు, పాములు వస్తుండటం మనకు తెలిసిందే. కానీ ప్రస్తుతం వెరైటీగా.. ముంబైలోని పట్టాల మీద.. చేపలు స్విమ్ చేస్తు కన్పించాయి. దీంతో ప్రయాణికులు ఆశ్చర్యంతో చూస్తు ఉండిపోయారు. చేపలు ఏంచక్కా..నదిలో లేదా సముద్రంలో ఈత కొట్టినట్లు అటు ఈటు స్విమ్ చేస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. దీన్ని చూసిన నెటిజన్లు బాబోయ్.. ఇదేం నీళ్లు బాబోయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే అధికారులు అత్యవసరమైతే తప్ప బైటకు రావొద్దని కూడా సూచించారు. వరుసగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ముంబై ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. వాతావరణశాఖ ప్రకారం.. మరింతగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాల పడ్డ ప్రదేశంలో ముంబై నగరి పాలిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా.. నీళ్ల ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. డిజాస్టర్ సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి