kedarnath helicopter accident goes viral: ఇటీవల విమానాలు, హెలికాప్టర్ లు తరుచుగా ప్రమాదాలకు గురౌతున్నాయి. ఏవేవో సాంకేతిక సమస్యలు తలెత్తి విమానాలు గాల్లోనే బ్లాస్ట్ అవుతున్నాయి. మరికొన్ని సార్లు సిగ్నలింగ్ సమస్యల వల్ల ఒక చోట లాండ్ అవ్వాల్సిన హెలికాప్టర్ లు మరోక చోట లాండ్ అవుతున్నాయి. హెలికాప్టర్ లలో టెక్నికల్ సమస్యల వల్ల.. దేశాధినేతలు, ఆర్మీ ముఖ్య అధికారులు, వీఐపీలు, సినిమా స్టార్ లు, రాజకీయ నాయకులు కూడా చనిపోయిన  ఘటనలు వార్తలలో నిలిచాయి. ఈ క్రమంలో ఇటీవల కాలంలో హెలికాప్టర్ లు తరచుగా అనేక రకాల సాంకేతిక సమస్యలతో వార్తలలో ఉంటున్నాయి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కొంత మంది నేతలు హెలికాప్టర్ జర్నీ అంటే భయపడిపోతున్నారు. ముఖ్యంగా వీఐపీలు, కీలక నేతలు దూర ప్రదేశాలకు వెళ్లేందుకు హెలికాప్టర్ లను ఉపయోగిస్తుంటారు. ఇటీవల కేదార్ నాథ్ వంటి ఆలయాల దగ్గర హెలికాప్టర్ సేవలతో భక్తులను తరలిస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరిగిన ఘటన వార్తలలో నిలిచింది. ఆర్మీ చాపర్ నుంచి హెలికాప్టర్ జారి పడిపోయిన ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. 


పూర్తి వివరాలు..


 ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. కొండ చరియలు కూడా విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో.. ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్‌నాథ్‌ యాత్రను కూడా ఇప్పటికే అధికారులు నిలిపివేశారు. ఇదిలా ఉండగా.. యాత్రికులు కేదార్‌నాథ్‌ వెళ్లేందుకు హెలికాప్టర్‌ సేవలు కూడా ప్రారంభించారు. అయితే కొన్ని రోజుల క్రితం ఈ యాత్రికులను తరలించే క్రెస్టల్ హెలికాప్టర్.. కేదార్‌నాథ్‌లో భక్తులను దించి.. తిరిగి వెళ్తుండగా.. సాంకేతిక లోపంతో కూలిపోయింది. దీంతో అధికారులు ఆర్మీ అధికారుల సహాయం తీసుకున్నారు. అప్పుడు రంగంలోకి ఆర్మీచాపర్ దిగింది.


ఈ దెబ్బతిన్న క్రెస్టల్ హెలికాప్టర్‌ను అక్కడి నుంచి తరలించేందుకు ఇండియన్ ఆర్మీకి చెందిన ఎంఐ-17 భారీ చాపర్‌ను రంగంలోకి దించారు. ఈ భారీ చాపర్‌కు తీగలు కట్టి.. ఆ దెబ్బతిన్న హెలికాప్టర్‌ను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. చాపర్ ఒక్కసారిగా పైకి..ఎగిరి భూమి నుంచి వేల అడుగులపైకి వెళ్లిపోయింది. ఇంతవరకుబాగానే ఉన్నా.. ఒక్కసారిగా అనుకోని ఘటన చోటు చేసుకుంది.


 ఈ క్రమంలోనే హెలికాప్టర్.. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత కేదార్‌నాథ్‌-గచౌర్‌ మధ్య భీంబాలి ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఎంఐ-17 హెలికాప్టర్‌కు కట్టిన కేబుల్స్ తెగిపోయాయి. దీంతో గాల్లో ఎగురుతున్న ఎంఐ-17 హెలికాప్టర్ నుంచి క్రెస్టల్‌ హెలికాప్టర్‌ వేగంగా అక్కడ ఉన్న కొండల్లో పడిపోయింది. చూస్తుండగానే.. హెలికాప్టర్ కిందకు పడిపోయింది. వేల అడుగుల ఎత్తు నుంచి క్రెస్టల్‌ హెలికాప్టర్‌ మందాకిని నది  సమీపంలో జారి పడింది. ఈ ఘటనలో హెలికాప్టర్‌ మొత్తం ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 


Read more: Ditect Hidden cameras: హోటల్స్ లో, బాత్రూమ్ లలో సీక్రెట్ కెమెరాల అనుమానామా..?.. ఇలా ఈజీగా కని పేట్టేయోచ్చు..


 ఇక భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో సాగుతున్న కేదార్‌నాథ్‌ యాత్రను కొన్నిరోజుల క్రితం అధికారులు నిలిపివేశారు. దీంతో యాత్రికులు హెలికాప్టర్ ద్వారా అక్కడికి చేరుకుంటున్నారు. ఈ క్రెస్టల్‌ హెలికాప్టర్‌ను యాత్రికులను తరలించేందుకు వినియోగంచేవారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా గౌరీకుండ్‌-కేదార్‌నాథ్‌ల మధ్య చిక్కుకుపోయిన వేలాది మంది యాత్రికులను రక్షించేందుకు ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.