Waitress Beats Customers: మీద చెయ్యేసిన రౌడీ కస్టమర్లని రఫ్ఫాడించింది
Waitress Beats Customers: ఆడోళ్లే కదా ఏం చేసినా తిరిగి ప్రతిఘటించలేరు అని అలుసుగా భావిస్తున్నారా ? అయితే, ఆ భావనే తప్పు. లేడీస్‌తో తిక్క వేషాలేస్తే ఏం కాదులే అనుకుంటే తప్పులో కాలేసినట్టే అవుతుంది. ఎందుకంటే లేడీస్‌లో ఆదిపరా శక్తులు కూడా ఉంటారు. సమయం వచ్చినప్పుడు, ఆపద ఎదురైనప్పుడు వారిలో దాగి ఉన్న ఆది పరాశక్తి బయటికొస్తుంది. ఇదిగో ఈ వీడియో కూడా అలాంటిదే.
Waitress Beats Customers: కొన్నిసార్లు సినిమాల్లో హీరోయిన్స్ గాల్లో ఎగిరెగిరి తన్నడం, రౌడీల ముఖంపై పంచ్‌ల వర్షం కురిపించడం, పిడిగుద్దులతో రౌడీలను తోక ముడిచి పారిపోయేలా చేయడం చూస్తుంటాం. అలాంటి సీన్స్ చూసినప్పుడు ఇలాంటి దృశ్యాలన్నీ కేవలం సినిమాల్లోనే కనిపిస్తాయి కానీ రియల్ లైఫ్‌లో సాధ్యపడేవి కావు అని అనిపిస్తాయి కదా. మహిళలను వేధించే వారికి, ఇబ్బంది పెట్టే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పేలా లేడీస్ అందరూ ఇలా ఉంటేనే బాగుంటుంది కదా అని అనిపిస్తుంటుంది కదా. ఇది మహిళా సాధికారతను ఇష్టపడే వారి తత్వం. మహిళా సాధికారతను ప్రోత్సహించే వారు కోరుకునేది కూడా అదే.
అలా కాకుండా లేడీసే కదా అని లైట్ తీస్కుంటున్నారా ? ఆడోళ్లే కదా ఏం చేసినా తిరిగి ప్రతిఘటించలేరు అని అలుసుగా భావిస్తున్నారా ? అయితే, ఆ భావనే తప్పు. లేడీస్‌తో తిక్క వేషాలేస్తే ఏం కాదులే అనుకుంటే తప్పులో కాలేసినట్టే అవుతుంది. ఎందుకంటే లేడీస్‌లో ఆదిపరా శక్తులు కూడా ఉంటారు. సమయం వచ్చినప్పుడు, ఆపద ఎదురైనప్పుడు వారిలో దాగి ఉన్న ఆది పరాశక్తి బయటికొస్తుంది. అదే కానీ జరిగితే ఆ లేడీస్‌తో తిక్క వేషాలేసిన వాళ్లకు పట్టపగలే ఇక సుక్కలే సుక్కలు. ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే ఈ దృశ్యం కూడా అలాంటిదే. రెస్టారెంట్‌లో తినడానికి వచ్చిన ఇద్దరు రౌడీ మూకలు.. తిని వెళ్లిపోకుండా అక్కడ వెయిట్రెస్‌గా పనిచేస్తోన్న యువతిని కెళికారు. ఆ యువతి తిరగబడి ఇద్దరినీ రఫ్ఫాడించింది. ఫీమేల్ బ్రూస్ లీనా చూస్తున్నామా అన్నట్టుగా ఇద్దరు అల్లరి వెదవలకు గట్టిగా బుద్ధి చెప్పింది.
లేడీసే కదా.. మనం ఏం చేసినా నడిచిపోద్ది అనే భావన పోవాలి. లేడీస్ కూడా ఎందులోనూ తక్కువ కాదు అనే విషయాన్ని అందరూ గ్రహించాలి. మహిళలను గౌరవించాలి.. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆర్టీసీ బస్సుల్లో.. ప్రభుత్వ కార్యాలయాల్లో, నలుగురు తిరిగే చోట ఎన్ని నోటీసు బోర్డులు పెట్టినా కొందరి తీరులో మార్పు రావడం లేదు అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజెన్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేసిన నెటిజెన్ కూడా ఇంట్రెస్టింగుగా ఈ వీడియోకు ఫీమేల్ బ్రూస్ లీ అనే క్యాప్షన్ ఇచ్చాడు.