Mobile Number: మనకు తెలిసి కొన్ని..తెలియక ఇంకొన్ని ఫోన్ నెంబర్లు మన పేరుమీద చాలానే ఉంటాయి. ఒక్కసారి ఇలాంటివి అసాంఘిక శక్తుల చేతిలో పడితే మనకే ప్రమాదం. మరి మనపేరు మీద ఎన్ని ఫోన్ నెంబర్లున్నాయో ఎలా తెలుసుకోవడం..ఇవీ వివరాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిత్య జీవితంలో ఓ భాగంగా మారిపోయింది మొబైల్. ఏదో కారణంతో మనకు తెలిసో తెలియకో ఫోన్ నెంబర్లు(Mobile Numbers) మార్చుతుంటాం. కొత్తవి తీసుకుంటుూ ఉంటాం. లేదా మీ ఆధార్ జిరాక్స్ ఆధారంగా ఎవరో ఒకరు మీ పేరున ఫోన్ నెంబర్ తీసుకుని అసాంఘిక వ్యవహారాలకు వాడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఈ నేపధ్యంలో మన పేరున ఎన్ని మొబైల్ నెంబర్లున్నాయో తెలుసుకుంటే బాగుంటుంది కదా. అందుకే కేంద్ర టెలీకం మంత్రిత్వశాఖ( Telecom Ministry) తొలిసారిగా అలాంటి అవకాశం కల్పిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా ముందుగా ఏపీ , తెలంగాణలోనే ఈ సేవలు అందుబాటులో వచ్చాయి.


మీ పేరున ఎన్ని ఫోన్ నెంబర్లున్నాయో ( How to check the number of sim cards and mobile numbers on your name) తెలుసుకోవాలంటే..ముందుగా మీరు tafcop.dgtelecom.gov.in వెబ్‌సైట్‌లో వెళ్లాలి. మనం వాడే ఫోన్ నెంబర్‌ని ఎంటర్ చేస్తే మీ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దాంతో లాగిన్ ఇవ్వాలి. ఒకసారి సైట్‌లో లాగిన్ అవగానే మనపేరున ఎన్ని ఫోన్ నెంబర్లున్నాయనేది డిస్‌ప్లే అవుతుంది. ఇందులో మనకు అవసరం లేనివి తొలగించుకునే ఆప్షన్ ఉంటుంది. మనకు తెలియకుండా ఏదైనా నెంబర్ ఉంటే ఇదే వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.


Also read: Strawberry Moon Photos: ఆకాశంలో అద్భుతం, క‌నువిందు చేసిన స్ట్రాబెర్రీ మూన్‌ ఫొటో గ్యాలరీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook