Masked Aadhaar Card: ఆధార్ ప్రతి ఒక్కదానికీ ఆధారమైపోయింది. ఆధార్ కలిగి ఉండటం ఇప్పుడు అనివార్యమైపోయింది. అందుకే ఆధార్ కార్డుకు మరింత భద్రత చేకూరబోతోంది. ఆ కొత్త భద్రత ఎలా ఉంటుంది. ఆ ఆధార్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఇప్పుడు ఆధార్ కార్డు(Aadhaar Card) తప్పనిసరిగా మారింది. చిన్నారి నుంచి వృద్ధుడి వరకూ అన్నీ ఆధార్ కార్డుతోనే లింకప్ అవుతున్నాయి. ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్‌కు కూడా అదే ఆధారం. ఈ నేపధ్యంలో యూఐడీఏఐ పలు రకాల ఆధార్ సేవల్ని అందుబాటులో తెస్తోంది. ఇప్పుడు కొత్తగా మాస్క్ అనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. అంటే మీ ఆధార్ కార్డుకు కూడా మాస్క్ ఉంటుందన్నమాట. ఈ కొత్త ఫీచర్ మీ ఆధార్ కార్డుకు మరింత భద్రత చేకూరుస్తోంది. 


ఈ కొత్త మాస్క్ ఫీచర్‌తో(Mask Feature) కూడిన ఆధార్ కార్డులో మొదటి 8 అంకెల్ని ఎక్స్ ఎక్స్ ఎక్స్ అని కన్పిస్తుంది. అంటే మీ ఆధార్ కార్డులో చివరి 4 అంకెలు మాత్రమే కన్పిస్తాయి. ఈ ఫీచర్ వల్ల మీ ఆధార్ నెంబర్ ఇతరులు తెలుసుకోలేరని యూఐడీఏఐ (UIDAI) చెబుతోంది. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, చిరునామా, క్యూఆర్ కోడ్ వివరాలు మాత్రమే పూర్తిగా కన్పిస్తాయి. ఈ కొత్త ఫీచర్‌తో కూడిన ఆధార్ కార్డు మరింత సురక్షితం కానుంది. ఈ మాస్క్ ఆధార్ కార్డును(Masked Aadhaar Card) ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..


ముందుగా UIDAI Website అయిన https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి. అనంతరం  My Aadhaar ఆప్షన్ ఎంచుకుని..డౌన్‌లోడ్ ఆధార్‌పై క్లిక్ చేయాలి. ఈ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ ( How to download masked aadhaar card) చేసేందుకు ఆధార్ నెంబర్, ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, వర్చువల్ అంటూ 3 ఆప్షన్లు ఉంటాయి. ఇందులో ఒక ఆప్షన్ ఎంచుకుని  I want a masked Aadhaarపై క్లిక్ చేయాలి. ఇప్పుడు అక్కడ కన్పించే క్యాప్చ ఎంటర్ చేసి..సెండ్ ఓటీపీ ఎంచుకోండి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేసి..మాస్క్ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


Also read: Mobile Number: మీ పేరున ఎన్ని మొబైల్ నెంబర్లున్నాయో..ఇలా తెలుసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook