Cool Home Without Air Conditioning​: సాధారణంగా ఇల్లు చల్లబడాలంటే చాలామంది ముందున్న ఆప్షన్ ఏసీ లేదా కూలర్ ఉపయోగించడమే. కానీ అందరికీ ఏసీలు లేదా కూలర్స్ ఉపయోగించే అవకాశం ఉండదు కనుక ఏవో ఒక ఇతర మార్గాలు చూసుకుని ఇల్లు చక్కబెట్టుకునే మార్గం వెతుక్కోవాలి. ఇలా ఆలోచిస్తే.. ఇల్లు అయినా, వాతావరణం అయినా వేడెక్కడానికి చుట్టూ ఉన్న పర్యావరణమే కారణం అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే వీలయితే, మీ ఇంటిని పచ్చదనంతో కప్పేస్తే మీ ఇంటికి అందం రావడంతో పాటు ప్రకృతి పరంగా సహజంగా చల్లగా మారుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంట్లో వేడిని పెంచే హోమ్ అప్లయెన్సెస్ వినియోగం తగ్గించుకోవాలి. ఓవెన్స్, స్టవ్స్, బట్టలు ఆరబెట్టే డ్రయర్స్ వినియోగం, డిష్ వాషర్స్.. ఇలా పర్యావరణంలో వేడిని పెంచే హోమ్ అప్లయెన్సెస్ వినియోగం తగ్గించుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో పుట్టే వేడి మీ ఇంట్లోనే విస్తరిస్తుంది కనుక వాటి వినియోగం తగ్గించుకోవాలి. అలాగని అవి ఉపయోగించకపోతే పనులు ఎలా అవుతాయనే సందేహం కూడా వచ్చే ఉంటుంది కదూ.. దానికి కూడా మావద్ద సమాధానం రెడీగా ఉంది అంటున్నారు ఈ అంశంపై అధ్యయనం చేసిన వాళ్లు. అంతేకాదు... ఇంట్లో 60 వాట్స్, 100 వాట్స్ లాంటి ట్రెడిషనల్ బల్బ్స్ ఏమైనా ఉంటే వాటి స్థానంలో ఎల్ఈడీ లైట్స్ ఉపయోగించాలి. ఎందుకంటే ఎంత ఎక్కువ వాట్స్ ఉన్న ఎలక్ట్రిక్ లైట్స్ ఉపయోగిస్తే.. అంత ఎక్కువ వేడి పుడుతుంది.


ఎండకొట్టే సమయంలో ఎండ వేడిని ఇంట్లోకి రాకుండా పరదాలు వేసిపెట్టాలి. మరీ ముఖ్యంగా నల్ల రంగు పరదాలు వినియోగించొద్దు. ఎందుకంటే నలుపు రంగు పరదాలకు ఎండ వేడిని పీల్చుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఆ చుట్టు పక్కల పరిసరాలు కూడా అదే విధంగా వేడెక్కుతాయి. రాత్రి వేళలు పరదాలు తెరిచే పెట్టాలి. తద్వారా బయటి గాలి ఇంట్లోకి ప్రసరించి ఇంటి వాతావరణం కొంత చల్లబడుతుంది. అప్పటి వరకు ఇంట్లో ఉన్న వేడిని బయటి నుంచి వచ్చే గాలి రీప్లేస్ చేస్తుంది. 


[[{"fid":"275246","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"How To Keep Your Home Cool Without AC and cooler","field_file_image_title_text[und][0][value]":"How To Keep Your Home Cool Without AC and cooler"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"How To Keep Your Home Cool Without AC and cooler","field_file_image_title_text[und][0][value]":"How To Keep Your Home Cool Without AC and cooler"}},"link_text":false,"attributes":{"alt":"How To Keep Your Home Cool Without AC and cooler","title":"How To Keep Your Home Cool Without AC and cooler","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇది కూడా చదవండి : Chicken Biryani Rates: రూ. 30 కే చికెన్ బిర్యానీ, రూ. 32 కే మటన్ బిర్యానీ


ఈజిప్టియన్ మెథడ్
ఈజిప్టులో ఎండ వేడి ఇంకా ఏ రేంజులో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏసీ, కూలర్స్ లేని వాళ్లు అక్కడి వేడిని తట్టుకునేందుకు ఈజిప్టియన్ కాటన్ షీట్ మెథడ్. ఈజిప్టియన్ కాటన్ షీట్ మెథడ్ అంటే ఒక బెడ్ షీట్‌ని తీసుకుని చల్లటి నీళ్లలో తడిపి, నీళ్లు లేకుండా కేవలం తడి మాత్రమే ఉండేలా నీళ్లను పిండి, దానిని బెడ్‌పై పరిచి ఆ దిశగా గాలి వచ్చేలా ఫ్యాన్ ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఈజిప్టులో సర్వసాధారణంగా కనిపించే ప్రక్రియగా చెబుతుంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్... చల్లటి నీళ్లతో స్నానం చేయడంతో మీ శరీరం అలసట బారి నుంచి బయటపడి రిలాక్స్ అవుతుంది. ఇది మీకు ఎండ వేడి, ఉక్కపోత నుంచి కలిగే చికాకుతో కొంత ఉపశమనం ఇచ్చి ఎంతో హాయినిచ్చే అనుభూతిని అందిస్తుంది. 


ఇది కూడా చదవండి : IRCTC Tour Package: కేవలం 16 వేలకే ఎన్ని పుణ్యక్షేత్రాలు చుట్టి రావచ్చో !!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK