King Cobra Full Viral Video:  కింగ్ కోబ్రా అంటేనే భయం, ఆశ్చర్యం కలిగించే పేరు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విషపూరిత పాముగా పేరుగాంచింది. దీని దగ్గర నుంచి చూసే సాహసం ఎవరూ చేయరు. కానీ ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో కొంతమంది స్నేక్‌ క్యాచర్లు ప్రాణాలకు తెగించి మరీ వీటిని పట్టుకుంటున్న వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి అతి పొడవైనా కింగ్‌ కోబ్రాను ఎంతో సునాయాసంగా పటుకుంటున్న వీడియో వైరల్‌ అవుతుంది. ఇంతకీ ఆ యువకుడు ఆ కోబ్రాను ఎలా పట్టున్నాడు? అనే వివిరాలు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ యువకుడి బాత్రూమ్ టైల్స్ దగ్గర కింగ్‌ కోబ్రా కనిపించడంతో స్నేక్‌ క్యాచర్లకు సమాచారం అందిచాడు. వెంటనే సమాచారం అందుకున్న స్నేక్‌ క్యాచర్‌  దానిని చూసి ఒక కర్ర సహాయంతో ఎంతో సులువుగా దాని తోక పట్టుకొని బయటకు తీస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను @insta_dada_n.s అనే ఇన్‌స్టా హ్యాండిల్ షేర్ చేశారు. షేర్‌ చేసిన కొద్ది వ్యవధిలోనే చాలా మంది దీని చూసి ఆశ్చర్య పోయారు. స్నేక్‌ క్యాచర్‌ దైర్యంగా కింగ్‌ కోబ్రాను బయటకు తీయడం చూసి అవాక్కయ్యారు.  ఈ వీడియో క్లిప్‌ అంత ఆశ్చర్యపరిచే విధంగా లేకపోయినా కూడా స్నేక్‌ క్యాచర్‌ పట్టుకున్న స్టైల్‌కు నెటిజన్‌లు ఔరా అని కామెంట్ల్‌ చేస్తున్నారు. 


అసలు కింగ్‌ కోబ్రాలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి?


కింగ్ కోబ్రాలు ప్రపంచంలోని అతి పొడవైన విష సర్పాలు. ఇవి ఎక్కువగా  ఆసియా ఖండంలోని ఉష్ణ, ఉపఉష్ణమండల అడవుల్లో ఎక్కువగా నివశిస్తాయి. ముఖ్యంగా భారతదేశం, శ్రీలంక, మయన్మార్,  తైలాండ్‌లలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే మన భారతదేశంలో కింగ్‌ కోబ్రాలు ఎక్కువగా కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని వర్షారణ్యాలో కనిపిస్తాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లోని అడవులలో ఉంటాయి.


కింగ్ కోబ్రాలు ఎందుకు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి?


కింగ్‌ కోబ్రాలు ఎందుకు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండానికి కారణం ఆ ప్రాంతాల్లో ఎలుకలు,  చిన్న సర్పాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వాతావరణం ఎప్పుడు వెచ్చగా ఉంటుంది. కింగ్‌ కోబ్రలకు వెచ్చని వాతావరణం అంటే ఎంతో అనుకూలంగా ఉంటుంది. వీటికి అడువు, పొదలు,తీగలు వంటి ప్రాంతాల్లో ఉండటానికి ఇష్టపడుతాయి. 


కింగ్ కోబ్రాలు ఎందుకు ప్రమాదకరం?


కింగ్‌ కోబ్రాలను ఎందుకు ప్రమాదకరమైనవి అని చెబుతారంటే ఇది ఒకే కాటులో మానవులను చంపగలిగేంత విషాన్ని విడుదల చేస్తాయి. దీని విషయం నరాల వ్యవస్థపైన ఎంతో ప్రభావితంగా చూపుతుంది. అలాగే శ్వాసకోశం వెంటనే ఆగిపోతుంది. తర పాములతో పోలిస్తే, కింగ్ కోబ్రాలు దాడి చేయడానికి సంకోచించవు. అంతేకాకుండా ఇవి చాలా వేగంగా కదలుతాయి. దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం.  కింగ్ కోబ్రాలు చుట్టూ ఉన్న వాటిని చాలా బాగా చూడగలవు. 


కింగ్ కోబ్రాలను ఎలా నివారించాలి:


కింగ్ కోబ్రాలు సాధారణంగా అడవులు, పొదలు, తేమతో కూడిన ప్రాంతాలలో నివసిస్తాయి. ఈ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఎల్లప్పుడూ బూట్లు ధరించి, దట్టమైన పొదలలోకి ప్రవేశించకుండా ఉండటం చాలా మంచిది. ఒక వేళ కింగ్‌ కోబ్రా  కనిపించినప్పుడు దానిని తొందరపెట్టవద్దు. నెమ్మదిగా వెనక్కి వెళ్ళి, సహాయం కోసం పిలవండి. ఒకవేళ మీరు కింగ్ కోబ్రా కాటుకు గురైనట్లయితే, వెంటనే వైద్య సహాయం తీసుకోండి. అయితే  కింగ్ కోబ్రాలు ప్రకృతికి చాలా ముఖ్యమైనవి. అవి ఇతర జంతువులను తింటాయి,ఫూడ్‌ చేన్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. 


 


 



 


Disclaimer:


ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. 


Read more: Snake news: చేపను చూసి టెంప్ట్ అయిన పాము.. చూస్తుండగానే ఊహించని బిగ్ ట్విస్ట్.. ఎక్కడో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.