జియోతో పోటీని తట్టుకునేందుకు ఐడియా సరికొత్త ఆఫర్ తో ముందుకు వచ్చింది. తాజా ఆఫర్ ప్రకారం రూ.179 తో రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ లోకల్ కాల్స్ , 1జీబీ డేటా అందిస్తున్నట్లు ఐడీయా కంపెనీ పేర్కొంది. దీనికి వ్యాలిడిటీ 24 రోజుల పాటు ఉండనుంది. కాగా యాప్‌ నుంచి డౌన్ లోడ్ చేసుకొని ..వాటి ద్వారా రీఛార్జి చేసుకుంటే అదనంగా మరో జీబీ డేటా అందిస్తోంది.  వాయిస్‌ కాల్స్‌ను ఎక్కువగా చేసుకునే ప్రీపెయిడ్‌ చందాదారులను దృష్టిలో ఉంచుకొని ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ఐడియా కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. 


అంతకముందు ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం ఐడియా రూ.357 ఆఫర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 28రోజుల కాలపరిమితితో రోజుకు 1జీబీ డేటా, అపరిమిత లోకల్‌ కాల్స్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు అందించనుంది. వొడాఫోన్‌ రూ.177 ఆఫర్‌ను తీసుకొచ్చిన వారం వ్యవధిలోనే ఐడియా రూ.179 ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇందంతా జీయో ప్రభావమేనని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.