మీరు  ఫేస్బుక్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే సమాచారం లేదా టైమ్ లైన్ స్టేటస్ మీ స్నేహితులలో అందరికీ కాకుండా కొందరికి మాత్రమే కనబడాలని మీరు కోరుకుంటే.. ఆ పని కచ్చితంగా జరుగుతుంది. అందుకు తగ్గ పలు ప్రత్యేక ఫీచర్లు కూడా ఫేస్‌బుక్‌లో ఉన్నాయి. అందుకు గాను మీరు తొలుత Custom ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Cutom ఆప్షన్ ఎక్కడుందో తెలియాలంటే.. మీ పోస్టు బటన్‌కి ఎడమ వైపు ఉండే గ్లోబ్ చిహ్నంపై క్లిక్ చేయాలి. అప్పుడు More Options అనే టాబ్ ఓపెన్ అవుతుంది. దానిపై క్లిక్ చేయగానే వచ్చే Custom ఆప్షన్‌లోని Share with అనే టాబ్‌లో మీ స్టేటస్ ఎవరికి కనబడాలని భావిస్తున్నారో, ఆ స్నేహితుల పేర్లు మాత్రమే టైప్ చేయండి.


ఒకవేళ కొంతమంది స్నేహితులకు ఆ స్టేటస్ కనిపించకూడదు అని మీరు భావిస్తే.. Dont Share with టాబ్ పై క్లిక్ చేసి, ఆయా స్నేహితుల పేర్లను అందులో టైపు చేయండి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీరు ముందుగానే ఫ్రెండ్స్ లిస్టు తయారుచేసుకొనేటప్పుడు కుటుంబ సభ్యులతో పాటు స్కూలు ఫ్రైండ్స్, కాలేజీ ఫ్రెండ్స్ లేదా ఇతర స్నేహితుల పేర్లతో జాబితాలు తయారుచేసుకోవడం మంచిది.


అప్పుడు అప్ డేట్స్ కొంతమందికి మాత్రమే కనబడాలని మీరు కోరుకున్నప్పుడు పేర్లను కాకుండా, జాబితాలను ఎంటర్ చేసి, ఆయా జాబితాల్లో ఉన్నవారు మీ అప్ డేట్స్ చూడకుండా జాగ్రత్త పడవచ్చు.