Indian Family Home On Wheels Video Viral: మనలో చాలా మంది రెగ్యులర్ గా టూర్ లకు వెళ్లటానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ తో తరచుగా టూర్ లకు వెళ్తుంటారు. కానీ కొందరికి జర్నీలలో బైటి ఫుడ్ అస్సలు పడదు. దీంతో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని అనుకొని ఏకంగా టూర్లకు వెళ్లడమే మానేస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం.. ఇంట్లోని వాళ్లకు కొత్త ప్లేసులకు తీసుకెళ్లి, మంచి వెరైటీ ఫుడ్ లను టెస్ట్ చేయిస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



మనం తరచుగా ట్రైన్ లలో కొందరు వారానికి సరిపడా.. ఫుడ్ లను పెద్ద పెద్ద బాక్స్ లలో పెట్టుకుని వెళ్తుంటారు. అవి తప్ప మరే ఫుడ్ ఐటమ్స్ లను అస్సలు ముట్టుకోరు. ఇప్పటిదాక సోషల్ మీడియాలో..  కొందరు కార్లలో వెరైటీగా టిఫిన్ లు చేయడం, తమ వ్యాన్ లను టిఫిన్ లు చేసే విధంగా సెటప్ చేసుకొవడం మనం చూశాం. ఇక్కడ కూడా అచ్చం కారులో కిచెన్ సెటప్ ఏర్పాటు చేసి, అదికూడా కిచెన్ లో పెట్టుకుని పోపు డబ్బాలతో పాటు, బెడ్ సెటప్ కూడా చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.


పూర్తి వివరాలు.. 


సోషల్ మీడియా లో ప్రతిరోజు వందల కొద్ది వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యాన్ని గురిచేసేవిలా ఉంటాయి. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు, వైరల్ కంటెంట్ ఉన్న ఘటనలు వార్తలలో ఉంటాయి. నెటిజన్లు ముఖ్యంగా వెరైటీగా, ఫన్నీగా ఉన్న వీడియోలను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు అచ్చం ఇలాంటి వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ (@ghumakkad_bugz) షేర్ చేసారు. ఇక్కడ వీడియోలో చిక్క, కపిల్ అనే దంపతులు తమకారులోనే కిచెన్ ను ప్లాన్ చేశారు.  దీని కోసం ఏకంగా తమ కారునే కిచెన్ గా మార్చేశారు. అంతే కాకుండా.. వంటలకు కావాల్సిన ప్రతిఒక్కటి కారులో పెట్టుకుంది.


Read More: Janhvi Kapoor: సమంత దారిలో జాన్వి కపూర్.. అంత రిస్క్ అవసరమా అంటున్న అభిమానులు!


సిలిండర్, డబ్బాలు, చివరకు బెడ్ కూడా కారులో పడేటట్లు ఏర్పాట్లు చేసుకున్నారు. కారులో టెస్ట్ తమ వారితో కలిసి టెస్ట్ వంటలు చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. సూపర్ ఐడియా.., భలే ఉందిగా మీ ట్యాలెంట్ అంటూ ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు. 


 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook