Reels app features: టిక్ టాక్ యాప్‌పై కేంద్రం నిషేధం విధించిన తర్వాత ఆ స్థానాన్ని కబ్జా చేసేందుకు చాలా మొబైల్ యాప్స్ పోటీపడుతున్నాయి. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన టిక్ టాక్ యాప్ ( Tiktok app ) స్థానంలోకి రాగలిగితే.. తమ బిజినెస్ అంతే భారీగా సక్సెస్ అయినట్టేనని ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ భావిస్తున్నాయి. అందులో భాగంగానే చింగారి యాప్ ( Chingari app ), మోజ్ యాప్ ( Moj app ) లాంటి మొబైల్ యాప్స్ వచ్చాయి. ఇక ఇవే యాప్స్ బాటలో ఇప్పటికే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా రీల్స్ అనే మొబైల్ యాప్‌ని ( Reels mobile app ) తీసుకొచ్చింది. 15 సెకండ్స్ వీడియోలు క్రియేట్ చేయడంతో పాటు టిక్ టాక్ యాప్‌లో ఉండే అన్ని ఫీచర్స్ ఉండేలా రీల్ యాప్ మేకర్స్ ప్లాన్ చేశారు. ( Also read: Moj app: TikTok కి ప్రత్యామ్నాయంగా మరో యాప్ లాంచ్ చేసిన ShareChat )


రీల్ యాప్‌లోనూ ఆడియో ఎఫెక్ట్స్, మ్యూజిక్ ఉపయోగించుకుని వీడియోలు సృష్టించడంతో పాటు టిక్ టాక్ యాప్ తరహాలోనే ఇతర యూజర్స్‌తో పంచుకునేలా ఈ యాప్‌ని ఇన్‌స్టాగ్రామ్ డిజైన్ చేసింది. పాపులర్ సాంగ్స్, ట్రెండ్స్, వైరల్ ఛాలెంజెస్‌ అన్నింటికీ వీడియోలు రూపొందించుకునేలా రీల్ యాప్‌ని డిజైన్ చేశామని ఫేస్‌బుక్ ప్రోడక్ట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ విశాల్ షా తెలిపారు. రీల్ యాప్‌ని ఇన్‌స్టాగ్రామ్ ( Instagram ) లాంచ్ చేయగా.. ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటికే ఫేస్‌బుక్ అనుబంధ సంస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ( Also read: Tik Tok, UC Browser: టిక్‌ టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 మొబైల్ యాప్స్‌పై కేంద్రం నిషేధం )