Whatsapp New Features: వాట్సప్ చాట్ ను స్క్రీన్ షాట్ తీస్తే మూడు టిక్కులు గమనించారా?
Whatsapp New Features: వాట్సాప్‌కు సంబంధించిన ఓ ఫీచర్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అదే మూడు బ్లూ టిక్‌లు. అవతలి వ్యక్తి మన చాట్, ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను స్క్రీన్ షాట్ తీస్తే.. వాట్సాప్ అలర్ట్‌గా వెంటనే మూడు టిక్కులు చూపించనుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలుసుకుందాం.
Whatsapp New Features: ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ఒకటైన వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవతలి వ్యక్తి మన మెసేజ్‌లు, మనం పంపిన ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను స్క్రీన్ షాట్ తీస్తే.. వెంటనే అలర్ట్‌గా మూడు టిక్కులు కనిపిస్తాయన్నది ఆ వార్తల సారాంశం.
అంతేగాకుండా ఈ ఫీచర్‌ను పరీక్షించి త్వరలోనే వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు న్యూస్ తెగ వైరల్ అయ్యింది. అయితే ఇది పూర్తిగా అవాస్తవం అని వాట్సాప్ వివరాలను ఎప్పటికప్పుడు లీక్ చేసే వెబ్ బీటా ఇన్ఫో తెలిపింది.
సాధారణంగా వాట్సాప్‌లో మనం ఎవరికైనా మెసేజ్ చేస్తే.. డెలివరీ కాకపోతే ఒక బూడిద రంగు టిక్ కనిపిస్తుంది. అదే డెలివరీ అయితే రెండు టిక్ సింబల్స్ అదే రంగులో కనిపిస్తాయి. ఒక వేళ మనం పంపిన మెసేజ్‌ను ఎదుటి వ్యక్తి చూస్తే.. ఆ రెండు టిక్ సింబల్స్ కాస్తా నీలి రంగులోకి మారిపోతాయి.
ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే. వీటికి తోడు.. మన చాట్‌ను, మీడియాను స్క్రీన్ షాట్ తీస్తే.. మనకు తెలిసేందుకు వాట్సాప్ మూడో టిక్ సింబల్‌ను తీసుకురానున్నట్లు గాసిప్స్ వినిపించాయి.
వాస్తవానికి ఇలాంటి ఫీచర్ ఇతర యాప్‌ల్లో అందుబాటులో ఉంది. యువత ఎక్కువగా ఉపయోగించే స్నాప్‌చాట్, ఇన్స్టాగ్రామ్ డీఎం వానిష్ మోడ్లలో ఎదుటి వ్యక్తి స్క్రీన్ షాట్ తీస్తే మనకు తెలిసే ఫీచర్ ఉంది. నిజానికి ఈ ఫీచర్‌ను వివిధ కారణాల వల్ల వాట్సాప్ తీసుకురాలేదు. కాబట్టి ఈ వార్తలు అవాస్తవం.
అయితే వాట్సాప్ త్వరలో కాంటాక్ట్ ఇన్ఫో పేరుతో మరో ఫీచర్‌ను తీసుకురానున్నట్లు తెలిస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే.. లోకల్ బిజినెస్‌కు మరింత ఊతం కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు.
Also Read: ఈ ఫొటోలలో ఉన్న సొట్టబుగ్గల సుందరిని మీరు గుర్తుపట్టారా?
Also Read: Peacock Viral Video: హార్ట్ టచింగ్ వీడియో- చనిపోయిన నెమలిని ఆవేదనతో వెంబడిస్తూ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.