Costly grapes: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రూట్స్ లో ద్రాక్ష పండు తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. సాధారణంగా రెండు రకాల ద్రాక్షలు చూసి ఉంటారు. కానీ ద్రాక్ష(grapes)లో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటి ధర సీజన్‌లో అయితే రూ.వంద పైన సాధారణ రోజుల్లో 40-80 మధ్య ఉంటుంది. అయితే ఒక ద్రాక్ష పండు రకం ధర మాత్రం ఏకంగా రూ.లక్షల్లో ఉంటుంది. ఒక్క పండు ధరనే రూ.30 వేలకు పైగా ఉంటుంది. ఆ పండు ఏ రకమో.. ఆ పండు ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రూబీ రోమన్‌ ద్రాక్ష(Ruby Roman grapes)గా పిలిచే ఈ పండ్లు అత్యధిక ధర కలిగి ఉంటుంది. ఈ పండ్లు జపాన్‌(Japan)లో మాత్రమే లభిస్తుంటాయి. ఆ దేశంలోని ఇషికావా(Ishikawa) అనే ప్రాంతంలో మాత్రమే లభించే ఈ రూబీ రోమన్‌ పండ్లుకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంటుంది. ఈ ఎర్రని ద్రాక్ష(Ruby roman grapes) గుత్తి ధర మాత్రమే 12 వేల డాలర్లు. భారత కరెన్సీలో అక్షరాల రూ .7.5 లక్షలు. ఏంటి షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. ఒక్క ద్రాక్ష పండు ధర అయితే రూ. 35వేలకు పైగా ఉందట. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన(costly) ద్రాక్షగా అది రికార్డు నమోదు చేసింది. ప్రతి సంవత్సం 24వేల రూబీ రోమన్ ద్రాక్ష గుత్తులు మాత్రమే సాగు చేయబడతాయి.


Also Read:Miracle: వీర్యాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసి..యూట్యూబ్ చూసి.. బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌..!


ఈ పండు ప్రత్యేకతలు ఇవే..
*ఒకే రంగు, ఒకే సైజ్‌లో ఈ పండ్లు ఉంటాయి.
*ఎరుపు కలర్ లో ఉంటాయి.
*రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మరచిపోరు.
*సాధారణ ద్రాక్ష కంటే 18 శాతం అధికంగా తీపి కలిగి ఉంటుంది.
*ఈ పండ్ల విక్రయానికి అనేక నిబంధనలు ఉన్నాయి. ఇషికావా అధికారులు నిబంధనలకు అనుగుణంగా రూబీ రోమన్‌ ద్రాక్షపండ్లు విక్రయించాలి.
*ఈ పండ్ల నాణ్యత తనిఖీ చేసి ముద్ర వేసినవి మాత్రమే కొనుగోలు చేయాలి.
*ఏడాదిలో ఒకసారి మాత్రమే పండుతుంది.


2008లో విడుదల..
ఈ ఎరుపు రంగు ద్రాక్షను 2008 లో కొత్త ప్రీమియం(Premium grapes) వెరైటీ ఫలాలుగా మార్కెట్లో విడుదల చేశారు. జపాన్​ దేశంలోని ఇషికావా దీవిలో వీటిని ప్రత్యేకంగా పెంచి విక్రయిస్తారు. పెరిగే ముందు ప్రతి ద్రాక్షను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ పండ్లను వినియోగదారులు ఎక్కువగా బహుమతులుగా లేదా వ్యాపార ప్రయోజనాల కోసం కొనుగోలు చేస్తారు. 2020లో ఈ ఎర్ర ద్రాక్ష గుత్తి 12000 USD​ (సుమారు రూ. 7,50,000) లకు విక్రయించారు. అంటే ఒక ద్రాక్ష ధర రూ. 35,000 అన్నమాట. దశాబ్దం క్రితం ద్రాక్షను మార్కెట్లో విడుదల చేసినప్పటి నుంచి ఇది అత్యంత ఖరీదైన పండుగా ఉంది. అప్పటి నుంచీ ఈ ద్రాక్ష చాలా ప్రజాదరణ పొందింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి