Kacha Badam: ప్రస్తుతం ఇంటర్నెట్​ను షేక్​ చేస్తున్న బెంగాలి పాట 'కచ్చా బాదామ్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలెబ్రెటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా ఈ సాంగ్​కు డ్యాన్సులు చేస్తూ.. సమాజిక మాధ్యమాల్లో తమ వీడియోలను పెడుతున్నారు లక్షలాది మంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక సోషల్​ మీడియాలో తమ వీడియోలను పెట్టకపోయినా.. మిలియన్ల మంది ఈ సాంగ్​ను తెగ ఎంజాయ్​ చేస్తున్నారు.


పాటకు మూలం..


ఇంటర్నెట్​లో ఇప్పడు తెగ ట్రెండ్​ అవుతున్న ఈ క్యాచీ జింగిల్​ను పాడిన వ్యక్తి పేరు బూబన్​ బద్యాకర్​. పశ్చిమ్​ బెంగాల్​కు చెందిన ఆయన ఓ చిరు వ్యాపారి. గ్రామాల్లో సైకిల్​పై తిరుగుతూ పల్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు.


పల్లీలు కొనేలా జనాలను ఆకర్షించేందుకు ఇలా సొంతంగా తానే లిరిక్స్ రాసుకుని పాడారు. తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు చేసిన ఈ ప్రయత్నం ఏకంగా ఇంటర్నెట్ సెన్షేషన్​గా మారింది.


ఆయన పాడిన కచ్చా బాదమ్​ పాటను కొంత మంది సోషల్​ మీడియాలో పెట్టారు. దీనితో అది కాస్త వైరల్ అవడంతో ఆయనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.


అంతేనా.. అదే పాటను ఓ యూట్యూబ్​ ఛానెల్ వాళ్లు ఆయననే పెట్టి రీ మిక్స్​ చేశారు. దీనితో బూబన్​ బద్యాకర్ ఇప్పుడు సెలెబ్రెటీ అయిపోయారు. బూబన్ బద్యాకర్​​ ప్రతిభను గుర్తించి ఇటీవలే బెంగాల్ పోలీసులు కూడా ఆయనను సత్కరించడం విశేషం.


ఇంత జరిగినా ఆయన ఆర్థిక స్తితి మాత్రం ఏం మారలేదు. ఈ విషయంపై నెట్టజన్లు.. అసలు ఆయన పాటను క్రెడిట్​ను వాడుకున్నా ఎందుకు ఆర్థిక స్థితి ఇంకా అలానే ఉంది అని ప్రశ్నిస్తున్నారు.


ఈ నేపథ్యంలో బూబన్​ బద్యాకర్​తో పాటను రీమిక్స్ చేసిన Godhuli Bela Music స్పందించింది. ఆయనతో పాటకోసం రూ.3 లక్షలకు డీల్​ కుదుర్చుకున్నట్లు తెలిపింది. నేడు (శుక్రవారం) రూ.1.5 లక్షల చెక్ అందించినట్లు తెలిపింది. మిగతా మొత్తాన్ని వచ్చే వారం చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది.



ఇక బూబన్ బద్యాకర్​తో పాడించి, రీమక్స్ చేసిన సాంగ్​కు యూట్యూబ్​లో దాదాపు 7 కోట్ల వ్యూస్ వచ్చాయి. 


Also read: Viral Video: పెళ్లి కూతురు ముస్తాబు చూసి నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు!


Also read: Viral Video: ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదన్నట్టు స్టెప్పేసిన నవ వధువు.. చూస్తే షాకే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook