COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

King Brown Snake Viral Video: సోషల్ మీడియా వినియోగం రోజురోజుకు పెరుగుతున్న కారణంగా అనేక రకాల కొత్త కొత్త విషయాలు నెటిజన్లు సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రతి విషయం సెకండ్లలోనే ట్రెండ్ అవుతోంది. ప్రతిరోజు నెట్టింట్లో లక్షలాది వీడియోలు వైరల్ గా మారుతాయి. ఇందులో చాలా వీడియోలు జంతువులకు సంబంధించినవి అయితే మరికొన్ని మాత్రం సోషల్ మీడియా వినియోగదారులకు నవ్వు కలిగించేవే.. గత కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వైరల్ అయ్యే వీడియోలు నెటిజన్లకు ఆశ్చర్యంతో పాటు భయాందోళనలు కలిగిస్తున్నాయి. 


ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆస్ట్రేలియా కి చెందిన ఓ స్నేక్ క్యాచర్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని అడవి ప్రాంతంలో నివసించే వారి ఇళ్లలోకి పాములు రావడం సహజం. ఇటీవలే ఓ వ్యక్తి కి సంబంధించిన ఇంటి లోపల ఉన్న టాయిలెట్లో ఎంతో భయంకరమైన బ్రౌన్ కింగ్ కోబ్రా దూరింది. అయితే దీనిని ముందుగానే గమనించిన ఆ ఇంటి యజమాని స్నేక్ క్యాచర్ కి ఇన్ఫర్మేషన్ అందించాడు. దీంతో వారు హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకున్నారు. 



స్నేక్ క్యాచెస్ ఇంటిలోకి చేరుకున్న తర్వాత.. పామును ఐదు నిమిషాల పాటు చాలా వెతికారు. కానీ వారికి ఆ పాము కనిపించకపోవడంతో నిరాశకు గురయ్యారు.  చివరికి వారిలోనే ఒకరు పాము టాయిలెట్ వద్ద నుంచి హాల్లోని మ్యాట్ కింద దాగి ఉండడం చూసి ప్రధాన స్నేక్ క్యాచర్ కి ఇన్ఫర్మేషన్ అందించాడు. దీంతో ఆ స్నేక్ క్యాచర్ అలర్ట్ అయ్యాడు. ఆ పామును వాటి నుంచి బయటకి ఎంతో చాకచక్యంగా లాగేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో భాగంగా అతన్ని ఆ పాము కాటేసేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా ఆ స్నేక్ క్యాచర్ పామును పట్టుకునేందుకు ప్రయత్నం చేశాడు. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  


ఇలా 15 నిమిషాల పాటు వేట కొనసాగింది. ఆ తర్వాత బ్రౌన్ కింగ్ కోబ్రా ఆ స్నేక్ క్యాచర్ కి చిక్కింది. ఏదేమైనా ప్రమాదకరమైన పాములను పట్టుకునేందుకు ఎంతో ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. అయితే ఈ వీడియోను మొత్తం చిత్రీకరించి ఆ స్నేక్ క్యాచర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook