Cobra Snake Video: స్నేక్ క్యాచర్‌కు సుస్సు పోయించిన కింగ్ కోబ్రా.. షాకింగ్ వీడియో వైరల్..
Snake viral video: కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ తెగ ప్రయత్నాలు చేశాడు. అది తిరగబడి దాడి చేసేందుకు సైతం ప్రయత్నించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Cobra snake viral video: సోషల్ మీడియాలో తరచుగా అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో పాముల వీడియోలకు మాత్రం యమక్రేజ్ ఉందని చెప్పుకొవచ్చు. అదేవిధంగా నెటిజన్ లు కూడా ఈ మధ్య కాలంలో పాముల వీడియో చూసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. అంతే కాకుండా.. వెరైటీగా ఉన్న పాముల వీడియోలను తరచుగా వైరల్ చేస్తున్నారు. అయితే.. కొంత మంది మాత్రం పాములంటే భయంతో ఆమడ దూరం పారిపోతుంటారు.
పాముల్ని అస్సలు చూసేందుకు కాదు కదా.. పేరు తల్చుకునేందుకు సైతం అస్సలు ఇష్టపడరు .అదే విధంగా పాముల్ని చంపితే కాలసర్పదోషం వస్తుందని చెప్తుంటారు. అందుకే కొంతమంది మాత్రం పాములు తమ ఇళ్లలో లేదా ఆవాసాల్లో కన్పిస్తే వెంటనే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తుంటారు. వారి వచ్చి పాముల్ని పట్టుకుని వెళ్లేంతవరకు ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని మరీ ఉంటారు.
అదే విధంగా ఇటీవల ఒక ఇంట్లోకి పాము ప్రవేశించినట్లుంది. కానీ అక్కడి వాళ్లు మాత్రం.. కోబ్రాను పట్టేందుకు తెగ ప్రయత్నాలు చేశారు. కానీ అదేంతో చాకచక్యంగా అతడి నుంచి తప్పించుకుని చీకటి గదిలోకి ప్రవేశించింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పాములన్నింటిలో కూడా కోబ్రా పాము అత్యంత విషపూరీమైందని చెప్తుంటారు. అదే విధంగా అది తన కన్న చిన్నపాముల్ని సైతం వేటాడి తినేస్తుంది. అంతే కాకుండా.. కోబ్రా గూడును కూడా పెడుతుందంటారు. అయితే.. ఇక్కడ ఒక కింగ్ కోబ్రా ఒక ఇంట్లోకి ప్రవేశించింది. అక్కడున్న వారు దాన్ని బంధించాలని కూడా స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో అతను అక్కడికి చేరుకున్నాడు.
రాచనాగును పట్టుకునేందుకు నానాపాట్లు పడినట్లు తెలుస్తొంది. అదే విధంగా కింగ్ కోబ్రా సైతం.. అతడికి చుక్కలు చూపించినట్లు తెలుస్తొంది. ఇంతలో కింగ్ కోబ్రా ఒక గదిలోకి ప్రవేశించింది. అతను.. పాము తోకను పట్టుకుని బైటకు లాగేందుకు ప్రయత్నించాడు.
Read more: Viral Video: చీరకట్టులో అందాలు ఆరబోస్తు.. పామును పట్టేసిన మహిళ.. నెట్టింట దుమ్మురేపుతున్న వీడియో..
దీంతో పాము కోపంలో కటేయడానికి రావడంతో.. అతను భయంతో వెనక్కు వెళ్లిపోయినట్లు కన్పిస్తుంది. ఈవీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. స్నేక్ క్యాచర్ కు భలే సుస్సు పోయించిందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter