Sisters Catching King Cobra`s: బొక్కలో ఐదు కింగ్ కోబ్రాలు.. ఒట్టి చేతులతో ఈజీగా పట్టేసిన అక్కాచెల్లెళ్లు
2 Sisters Discovered Dangerous Cobras: పాములను చూస్తేనే వణికిపోతాం.. అలాంటింది ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు బొక్కలో దాక్కున్న 5 భయంకర కింగ్ కోబ్రాలను బయటకి తీసి ఎలా పెట్టుకున్నారో మీరే ఒక లుక్కేయండి!
2 Young Daring and Dashing Sisters Catching Black King Cobra's: పాములు అంటే చాలా మందికి భయం. ఇక త్రాచు పాము లేదా కింగ్ కోబ్రా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కింగ్ కోబ్రా కాటు వేస్తే అంతే సంగతులు. వెంటనే వైద్య సేవలు అందకుంటే.. ప్రాణాలు గాల్లో కలిపోవడం ఖాయం. కింగ్ కోబ్రా కాటేసే సమయంలో ఎక్కువ విషాన్ని చిమ్ముతుంది కాబట్టి.. ప్రతిఒక్కరు బయపడవుతారు. స్నేక్ క్యాచర్‌లు మాత్రమే కింగ్ కోబ్రాను పట్టుకుంటారు. అయితే ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్లు బొరియలో ఉన్న ఐదు కింగ్ కోబ్రాలను చాలా సులువుగా పట్టేశారు.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు, ఓ తమ్ముడు కలిసి పనికోసం రోడ్డు మార్గం ద్వారా వెళుతుంటారు. ఈ క్రమంలో అక్కాచెల్లెళ్లకు బొరియలో కింగ్ కోబ్రాలు ఉన్నట్టు గుర్తిస్తారు. వెంటనే వారు పనిముట్లు తీసుకుని బొరియ వద్దకు వెళతారు. బొరియలోంచి పాములను తీయడానికి సాధ్యం కాకపోవడంతో.. గడ్డపార సాయంతో తొవ్వుతారు. వారికి బొరియలో 5 పాములు కనిపిస్తాయి. వెంటనే వారు ముగ్గురు బయపడి పక్కకు వెళుతారు.
స్టిక్ సాయంతో తమ్ముడు పాము తోకలను బయటికి లాగగా.. అక్క వాటిని పట్టుకుంటుంది. తోకలను పట్టుకుని లాగగా.. బొరియ నుంచి ఏకంగా ఐదు కింగ్ కోబ్రాలు బయటికి వస్తాయి. ఏమాత్రం భయపడని అక్క అన్ని పాము తోకలను పట్టుకుని కంట్రోల్ చేస్తుంది. ఆపై ఒక్కోదాన్ని పట్టుకుని సంచిలో బంధిస్తుంది. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను 'Giant King Cobra' అనే యూట్యూబ్ ఛానెల్లో ఉంది. 6 నెలల క్రితం పోస్ట్ అయిన ఈ వీడియోకి 6,209 వ్యూస్ వచ్చాయి. ఐదు కింగ్ కోబ్రాలను పట్టుకున్న అక్కాచెల్లెళ్లను అందరూ ప్రశంసిస్తూన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి