Man Playing with 16 Feet Black King Cobra: రోడ్డుపై వెళ్తూ చిన్నపాటి పాము మనకు తారసపడితేనే మన ఒంటిలో వణుకు పుడుతుంది. అలాంటిది 'కింగ్ కోబ్రా' కనిపిస్తే ఆ చుట్టుపక్కల కూడా ఉండం. ఎందుకంటే కింగ్ కోబ్రా కాటేస్తే మనిషి బ్రతకడం చాలా కష్టం. అలాంటి కింగ్ కోబ్రాతో ఓ వ్యక్తి ఫన్నీగా ఆడుకున్నాడు. ఎంతలా అంటే.. కుక్క పిల్ల మాదిరి కింగ్ కోబ్రాతో సరదాగా ఆడుకున్నాడు. అంతేకాదు దాన్ని ఒట్టి చేతులతో పట్టుకొనే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైరల్ అవుతున్న వీడియో (King Cobra Man Viral Video) ప్రకారం... ఓ స్నేక్ క్యాచర్ అడవిలో భారీ సైజ్ ఉన్న బ్లాక్ కింగ్ కోబ్రాను చూస్తాడు. అతడిని చూసిన పాము పొదల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. వెంటనే అతడు తోక పట్టుకుని బయటకు లాగుతాడు. దాంతో ఆ వ్యక్తిపై బుసలు కొడుతూ దూసుకొచ్చింది. కింగ్ కోబ్రా పడగ విప్పి ఉండగా.. ఆ వ్యక్తి దాని ముందు కూర్చుని పాము కళ్లలోకి చూస్తుంటాడు. ఆపై చెట్టుతో పట్టుకోవడానికి ప్రయత్నించగా అది కాటేయడానికి మీదికి దూసుకొస్తుంది. అలెర్ట్ అయిన ఆ వ్యక్తి పాము కాటు నుంచి కొద్దిలో తప్పించుకుంటాడు. 



Also Read: Maruti Swift Price 2023: 4 లక్షలకే మారుతీ స్విఫ్ట్‌ని ఇంటికి తీసుకెళ్లండి.. రోడ్ టాక్స్ కూడా అవసరం లేదు!


బ్లాక్ కింగ్ కోబ్రాతో స్నేక్ క్యాచర్ సరదాగా ఆడుకుంటాడు. అది బుసలు కొడుతూ మీదికి వస్తున్నా.. తప్పించుకుంటూ ఆటాడుకుంటాడు. పాముపై పడుకుని మరీ ఆడుకుంటాడు. చివరకు బ్లాక్ కింగ్ కోబ్రాను కంట్రోల్ చేసి పట్టుకుంటాడు. ఆపై భారీ బ్లాక్ కింగ్ కోబ్రాను సంచిలో వేసుకుని వెళ్ళిపోతాడు. ఇందుకు సంబందించిన వీడియోను 'NDT Trading' అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. రెండు వారాల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియోకి లైకుల, కెమెంట్ల వర్షం కురుస్తుంది. 'అది కుక్క పిల్లా లేదా కింగ్ కోబ్రానా', ' కింగ్ కోబ్రాతో పరాచికాలు ఏందిరా అయ్యా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: Ugadi 2023 Panchangam: ఉగాది పంచాంగం 2023.. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు! ఉద్యోగులకు మాత్రం ప్రమోషన్ పక్కా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి