Rescue of a deadly venomous King cobra by Snake Catcher Ajay Giri: 'కింగ్ కోబ్రా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 12- 20 అడుగుల పొడవు ఉండే కింగ్ కోబ్రా ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి. ఎక్కువగా అడవుల్లో సంచరించే కింగ్ కోబ్రా.. అప్పుడప్పుడు మాత్రమే జనావాసాల్లోకి వస్తుంటుంది. అలా వచ్చిన దాన్ని చూసి జనాలు హడిలిపోతారు. నేరుగా కనిపిస్తే వెనక్కితిరిగి చూడకుండా పరుగెత్తుతారు. ఎందుకంటే కింగ్ కోబ్రా కాటు వేస్తే 10-15 నిమిషాల్లో మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాటేసే సమయంలో కింగ్ కోబ్రా ఎక్కువ విషంను చిమ్ముతుంది. ఆ విషం మనిషి నాడీ వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కింగ్ కోబ్రాను సాధారణ మనిషి పట్టుకోవడం అసలు సాధ్యం కాదు. పట్టుకోవడం అటుంచితే చంపడం కూడా దాదాపుగా అసాధ్యమే. ఎందుకంటే కింగ్ కోబ్రా తనలో మూడో వంతు పడగెత్తి.. ఉగ్రరూపంతో చూస్తుంటుంది. సీనియర్ స్నేక్ క్యాచర్‌లు మాత్రమే కింగ్ కోబ్రాను  చాలా జాగ్రత్తగా పట్టుకుంటారు. భారీ సైజ్ కింగ్ కోబ్రాలు అప్పుడపుడు స్నేక్ క్యాచర్‌లకు సైతం చిక్కవు. కింగ్ కోబ్రాల వలన మనుషులకు ప్రాణ హాని ఉంటుంది కాబట్టి.. జన సంచారంలోకి వచ్చిన కింగ్ కోబ్రాలను చాలా రిస్క్ చేసి స్నేక్ క్యాచర్‌లు పట్టేస్తుంటారు. ఈ క్రమంలోనే చెట్టుపైకి ఎక్కిన ఓ భారీ కింగ్ కోబ్రాను ఓ స్నేక్ క్యాచర్‌ ఒడుపుగా పట్టేస్తాడు. 


వైరల్ వీడియో ప్రకారం... ఓ కింగ్ కోబ్రా చెట్టు పైకి ఎక్కుతుంది. ఇది చూసిన జనాలు ఒక్కసారిగా భయపడిపోయి స్నేక్ క్యాచర్‌ అజయ్ గిరికి సమాచారం అందిస్తారు. అతడు వెంటనే కింగ్ కోబ్రా ఉన్న స్థలంకు చేరుకుంటాడు. స్నేక్ క్యాచర్‌ అజయ్ వచ్చేసరికి పాము చెట్టు కొమ్మలపై అటుఇటు తిరుగుతుంటుంది. స్నేక్ క్యాచర్‌ చాలా తెలివిగా పామును ఓ కొమ్మపైకి తీసుకొచ్చి.. తోకను పట్టుకుంటాడు. ఆపై కింగ్ కోబ్రాను కింద పడేస్తాడు. పారిపోతున్న పామును ఓ స్టిక్ సాయంతో స్నేక్ క్యాచర్‌ అజయ్ పెట్టేస్తాడు. ఆపై ముందుగా సెట్ చేసుకున్న సంచి వద్దకు దాన్ని తీసుకొస్తాడు. 



సంచి లోపలికి వెళ్లకుండా కింగ్ కోబ్రా ఇబ్బంది పెడుతుంది. అయినా సరే స్నేక్ క్యాచర్‌ అజయ్ పట్టువిడవడు. చాలా సమయం తర్వాత కింగ్ కోబ్రా సంచి లోపలికి వెళుతుంది. ఆ సంచిని పట్టుకుని అడవిలోకి వెళ్లి అక్కడ వదిలేస్తాడు. ఇందుకు సంబందించిన వీడియోను లివింగ్ జువాలజీ (Living Zoology) అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఓ ఏడాది క్రితందే అయినా ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 


Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023.. జడేజా కంటే అశ్విన్‌ మంచి ఎంపిక: పాంటింగ్


Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ 2023.. రిషభ్‌ పంత్‌కు తుది జట్టులో చోటు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK.