King Cobra Viral Video: `కింగ్ కోబ్రా`కే బాస్.. పడగవిప్పిన పాము తలపై ఒక్కటిచ్చాడుగా! ఆ తర్వాత ఏం జరిగిందంటే
King Cobra Viral Video, Snake Charmer slaps King Cobras Head. కింగ్ కోబ్రా పడగపై పాములను ఆడించే వ్యక్తి తన చేతితో ఒక్కటిస్తాడు. దాంతో ఆ కింగ్ కోబ్రా అక్కడినుంచి వెళ్లిపోతుంది.
Snake Charmer slaps King Cobras Head, See What Happen Next: సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. సింహం, చిరుత, ఏనుగు, మొసలి, కోతి, కుక్క, పిల్లి, గుర్రం, పాములకు సంబందించిన వీడియోలు నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం చాలా చాలా ఫన్నీగా ఉంటాయి. ఇలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది.
థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో స్నేక్ షో ఇచ్చే ఓ వ్యక్తి (పాములను ఆడించే వ్యక్తి) 1000 కంటే ఎక్కువ నాగు పాములను పెంచుతున్నాడు. ఇందులో రకరకాల నాగు పాములు ఉన్నాయి. వాటంన్నింటిని అండర్ గ్రౌండ్‌లో పెంచుతుంటాడు. ఆ వ్యక్తి స్నేక్ షోను ఇచ్చే ప్రతిసారీ తన దగ్గర ఉన్న పాములలో కొత్త వాటిని ఎంచుకుంటాడు. ఈ క్రమంలోనే తన కొత్త ప్రదర్శన కోసం పామును ఎంచుకునేందుకు వాటి మధ్యలోకి వెళతాడు. ఏ పామును ఎంచుకోవాలని అతడు చూస్తుంటాడు.
సదరు వ్యక్తి ఈ పామును ఎంచుకొవాలని ఆలోచిస్తుండగా.. అతని వెనుక ఒక పెద్ద కింగ్ కోబ్రా పడగ విప్పి కాటేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే సంచి మధ్యలో ఉండడంతో దాన్ని కాటేస్తుంది. వెనక్కి తిరిగిన ఆ వ్యక్తి కింగ్ కోబ్రా పడగపై తన చేతితో ఒక్కటిస్తాడు. దాంతో ఆ కింగ్ కోబ్రా అక్కడినుంచి వెళ్లిపోతుంది. ఆపై ఆ వ్యక్తి తనకు కావాల్సిన పామును పట్టుకుని పైకి ఎక్కుతాడు. ఇందుకు సంబందించిన వీడియోను నికో జోవనోవిక్ (Nico Jovanovic) యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో పాతదే అయినా.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'కింగ్ కోబ్రా'కే బాస్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఆ పాక్ పేసర్ ఐపీఎల్ వేలంలోకి వస్తే 15 కోట్లు పక్కా.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read: ఆసియా కప్ 2022 సూపర్ 4 భారత్ షెడ్యూల్ ఇదే.. మరోసారి పాకిస్తాన్‌తో పోరు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook