King Cobra Python Viral Video: గెలికి మరీ ప్రాణాల మీదికి తెచ్చుకున్న కింగ్ కోబ్రా.. కొండచిలువ పట్టు మాములుగా లేదుగా!
Viral Video: Python attacks and kills big King Cobra. కింగ్ కోబ్రాను కూడా కొండచిలువ సెకండ్లలో చంపేస్తుంది. ఇలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
Python attacks and kills big King Cobra: ఈ భూ ప్రపంచంలో 'కింగ్ కోబ్రా' అత్యంత విషపూరిత పాము. కింగ్ కోబ్రా చిమ్మించే విషం చాల చాలా విషపూరితమైనవి. అది ఒక్కసారి కాటేసిందంటే మనిషే కాదు బలమైన ఏనుగు కూడా 15 నిమిషాల్లో చనిపోతుంది. అందుకే చాలా మంది కింగ్ కోబ్రా అంటే కలలో కూడా జడుసుకుంటారు. అటువంటి కింగ్ కోబ్రాలను కూడా క్షణాల్లో చంపేసే పాములు కూడా ఉన్నాయి. అందులో కొండచిలువ ఒకటి. కొండచిలువ పట్టు మాములుగా ఉండదు. ఎదురుగా ఇంతపెద్ద పాము ఉన్నా దాన్ని మట్టికరిపిస్తుంది. కింగ్ కోబ్రాను కూడా సెకండ్లలో చంపేస్తుంది. ఇలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... అడవిలో కింగ్ కోబ్రా, కొండచిలువ తారసపడుతాయి. కొండచిలువను చూసిన కింగ్ కోబ్రా.. పైథాన్‌పై దాడి చేస్తుంది. కింగ్ కోబ్రా దాడిని కొండచిలువ తప్పించుకుంటుంది. కొండచిలువ పక్కకు వెళుతుండగా.. కింగ్ కోబ్రా మరోసారి దాడి చేసేందుకు ప్రయాసత్నిస్తుంది. దాంతో చిర్రెత్తిపోయిన కొండచిలువ.. కింగ్ కోబ్రా తలను చుట్టేస్తోంది. ఆపై కింగ్ కోబ్రాను మొత్తం చుట్టేసి దాన్ని ఊపిరాడకుండా చేస్తుంది. కాసేపటికి కింగ్ కోబ్రా చనిపోతుంది.
కింగ్ కోబ్రాను సెకండ్లలో మట్టికరిపించిన కొండచిలువకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని 'ContentMint' అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో 9 సంవత్సరాల క్రితందే అయినా.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 820,844 వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు 'గెలికి మరీ ప్రాణాల మీదికి తెచ్చుకున్న కింగ్ కోబ్రా', 'కొండచిలువను గెలికితే ఊరుకుంటుందా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: భారత్‌ను సెమీస్‌లో ఆడించాలనే.. ఐసీసీ అలా చేసింది! షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు
Also Read: Mehreen Pirzada: మాల్దీవ్స్ పర్యటనలో మెహ్రీన్.. పొట్టి డ్రెస్‌లో సెగలు రేపుతోందిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook