Snake Catcher peeled Big King Cobra Skin: పాములు తమ చర్మం (కోసం)ను విడుస్తాయనే సంగతి తెలిసిందే. ఏడాదిలో కనీసం రెండుసార్లు పాములు తమ కూసంను విడుస్తాయట. ఇందుకు కారణం ఏంటంటే.. పాము శరీరం నిత్యం పెరిగినా చర్మం మాత్రం పెరగదు. పాము ఎదుగుతుంటే దాని చర్మపు పొర చిన్నదైపోతుంది కాబట్టి.. ఆ చర్మపు పొరను అవి విడిచిపెడతాయి. ఆ తర్వాత విశాలమైన చర్మపు పొర ఏర్పడుతుంది. పాము చర్మం కింద మరో కొత్త చర్మం నిత్యం ఏర్పడుతుంది. అది పూర్తిగా ఏర్పడిన తర్వాత పాము పాత చర్మాన్ని కూసం రూపంలో వదిలిపెడుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కూసం విడిచే ముందు పాము నోటి వద్ద ఉండే పాత చర్మంపై ఓ చీలిక ఏర్పడుతుంది. దీంతో పాము ఏదైనా కొమ్మ లేదా రాళ్లకు రుద్దుతూ పాత చర్మాన్ని వదిలేస్థాయి. ఇలా చేస్తున్నప్పుడు పాముకు ఎలాంటి గాయాలు మాత్రం అవ్వవు. పాము పరిమాణం, శరీర స్థితి, వాతావరణం బట్టి ఈ ప్రక్రియ రోజుల నుంచి వారాల వరకూ జరుగుతుంతుంటుంది. ముసలి వయసు వచ్చే వరకూ పాముకు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అయితే వయసులో ఉన్నప్పుడు కంటే.. ముసలి వయసులో ఈ ప్రక్రియ కాస్త తక్కువ జరుగుతుంది. అయితే పాము కూసం విడిచిపెట్టినప్పుడు మనం నేరుగా చూడలేం. పెంచే పాములకు వాటి సంరక్షులే చర్మాన్ని తీసేస్తుంటారు. ఆ వీడియోను ఓసారి చూద్దాం. 


వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ఓ పాముల సంరక్షకుడు చాలా పాములను పెంచుతుంటాడు. అందులో అములవాస నుంచి అనకొండ వరకు ఉంటాయి. ఓ కింగ్ కోబ్రా తన కూసం విడుస్తూంటుంది. ఇది గమనించిన ఆ సంరక్షకుడు పాముని తీసి నీటిలో వేస్తాడు. చాలా సమయం తర్వాత దాని చర్మాన్ని పీకేస్తుంటాడు. నీటిలో నానిన కింగ్ కోబ్రా చర్మం చాలా ఈజీగా వస్తుంటుంది. అయితే దాని తల భాగంపై ఉన్న చర్మాన్ని పీకగనే నొప్పితో విలవిలలాడుతోంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఓ ఏడాది క్రితందే అయినా ఇప్పుడు మరోసారి ట్రెండింగ్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 


Also Read: King Cobra Man Viral Video: కింగ్ కోబ్రా మెడను గట్టిగా పట్టుకున్న వ్యక్తి.. నొప్పితో విలవిలలాడిన పాము! షాకింగ్ వీడియో  


Also Read: Shubman Gill Dating: మరో భామతో శుభ్‌మన్ గిల్ రొమాంటిక్ డేటింగ్.. నెట్టింట వీడియో వైరల్  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.