King Cobra Snake: నీ ధైర్యానికి దండం సామీ..! 20 అడుగుల కింగ్ కోబ్రా అటాక్ చేస్తే ఎలా అదుపు చేసాడో..
King Cobra Snake: పాములను చూసి చాలామంది భయాభ్రాంతులకు గురవుతూ ఉంటారు. అంతేకాకుండా పాములు మానవులకు ఎల్లప్పుడూ హాని కలిగిస్తూనే ఉంటాయి. పాములు లో ఉండే విషయం ఒక్కసారి మానవ శరీరంలోకి చేరితే మనిషి మరణించే అవకాశాలు అధికం.
King Cobra Snake: పాములను చూసి చాలామంది భయాభ్రాంతులకు గురవుతూ ఉంటారు. అంతేకాకుండా పాములు మానవులకు ఎల్లప్పుడూ హాని కలిగిస్తూనే ఉంటాయి. పాములు లో ఉండే విషయం ఒక్కసారి మానవ శరీరంలోకి చేరితే మనిషి మరణించే అవకాశాలు అధికం. అయితే ఇళ్లల్లోకి వచ్చిన పాములను అడవిలో వదిలేసేందుకు స్నేక్ క్యాచర్స్ చేసే సాహసం అంతో ఇంతో కాదు. ఇళ్లల్లోకి వచ్చిన పాములను అడవుల్లో విడిచి పెట్టేందుకు వారు చేసే ప్రయత్నాలు చాలా ప్రమాదకరమైనవిగా చెప్పొచ్చు. ప్రస్తుతం భూమి మీద చాలా రకాల పాములు ఉన్నాయి. కొన్ని మానవులకు హాని కలిగిస్తే మరికొన్ని ఎలాంటి హాని చెయ్యకుండా జీవిస్తాయి.
ప్రస్తుతం భూమి మీద ఉన్న పాముల్లో అధికంగా ఉండే పాములు మా మానవులకు హాని కలిగించేవే.. ఈ హాని కలిగించే పాములు ఇళ్లల్లోకి వస్తే స్నేక్ క్యాచర్స్ వాటిని అక్కడ నుంచి తీసుకెళ్లి సురక్షితమైన అడవి ప్రాంతాల్లో వదులుతున్నారు. అయితే ఇటీవల ఓ స్నేక్ చాట్ కు సంబంధించిన వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. ఆ వీడియోలోని సన్నివేశాలు అందరికీ భయం కలిగించవచ్చు..
ఇంత పెద్ద పామా..!:
మీరు పై వీడియోని గమనించినట్లయితే ఓ భయంకరమైన కింగ్ కోబ్రా ఇంటిలోకి ప్రవేశిస్తుంది. దీంతో ఆ ఇల్లు యజమాని స్నేక్ క్యాచరికి సమాచారం అందిస్తాడు. ఇంతలోనే ఆ స్నేకేచర్ వచ్చి.. ఆ బుసల కొడుతున్న అతి భయంకరమైన కింగ్ కోబ్రాను.. పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే పట్టుకునే క్రమంలో ఆ భారీ కింగ్ కోబ్రా అతన్ని చూసి పడగలు విప్పి కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతలోనే అది గమనించిన స్నేక్ క్యాచార్ పాము కాటు నుంచి తప్పించుకునేందుకు కట్టెను అడ్డంగా పెడతాడు. ఇలా ఆ పాము కాటు నుంచి తప్పించుకుంటాడు.
అయితే కొంత సేపు ప్రయత్నించి నిజంగానే ఆ భారీ కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్ సులువుగా పట్టుకుంటాడు. పట్టుకొని కొంతసేపు దానితో సాహసకరమైన ఆట కూడా ఆడుతాడు. ఈ దృశ్యాలు అందరికీ భయాన్ని కలిగించవచ్చు. అయితే ఇదే క్రమంలో ఆ పామును ఓ సంచిలో వేసి.. అడవి గల ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ వదిలేస్తాడు. ఇలా స్నేక్ క్యాచర్స్ వారి ప్రాణాలను పణంగా పెట్టి పాములను రక్షిస్తున్నారు. అంతేకాకుండా ఇదే క్రమంలో పాము కాటుకు గురై.. చనిపోతున్నారు. కాబట్టి భారీ కింగ్ కోబ్రాలను పట్టుకునే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok