King Cobra Swallowed and Spits Russel Viper: సోషల్ మీడియాలో నిత్యం బోలెడు వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి. అందులో యానిమల్ వీడియోలు కూడా చాలానే చూస్తుంటాం. చిరుతపులి, ఏనుగు, కోతి, పాములు.. ఇలా రకరకాల జంతువుల వీడియోలు కనిపిస్తుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరికొన్ని వీడియోలు టెర్రిఫిక్‌గా ఉంటాయి. అంటే.. చూడగానే భయం కలిగిస్తాయి. ప్రస్తుతం ఓ కింగ్ కోబ్రా షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ యూట్యూబ్ వీడియోను గమనిస్తే.. దాదాపు ఆరడుగుల పొడవున్న కింగ్ కోబ్రా స్నేక్ రక్తపింజర పామును సజీవంగా మింగేసింది. కాసేపటికే దాన్ని నోటి నుంచి కొద్ది కొద్దిగా బయటకు కక్కేసింది. అప్పటికీ ఆ రక్తపింజర ఇంకా సజీవంగానే ఉంది. చూడటానికి చాలా షాకింగ్‌గా ఉన్న ఈ ఘటన ఒడిశాలోని కటక్‌ జిల్లాలో ఉన్న బంకీ గ్రామంలో ఓ ఇంటి ఆవరణలో చోటు చేసుకుంది. కింగ్ కోబ్రాను చూసి హడలిపోయిన అక్కడి స్థానికులు వెంటనే రెస్క్యూ టీమ్‌కు ఫోన్ చేశారు. రెస్క్యూ టీమ్ ఆ కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకుని జనావాసాలు లేని చోట వదిలిపెట్టారు. 


కింగ్ కోబ్రాను చూడగానే తాము చాలా భయపడ్డామని స్థానికులు చెప్పారు. రెస్క్యూ టీమ్ వచ్చి ఆ కోబ్రాను పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్నామని చెప్పారు. ఈ వీడియో కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ 3,46,773 మంది ఈ వీడియోను యూట్యూబ్‌లో వీక్షించారు. వీడియో చూస్తే మీరు కూడా తప్పక షాక్‌కి గురవుతారు. 
 



Also Read: King Cobra Viral Video: నీ తెలివికి ఓ దండం సామి.. ప్రపంచంలోనే అతిపెద్ద కింగ్ కోబ్రాను ఎలా పట్టాడో చూడండి!


Also Read: Amit Sha Munugodu Meeting Live Updates: షెడ్యూల్ కు గంట ముందే హైదరాబాద్ కు  అమిత్ షా.. మునుగోడు ప్రచారానికి ప్రియాంక గాంధీ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook