King Cobra Video: ఆగ్రహానికి గురైన కోబ్రా.. స్నేక్ క్యాచర్‌ను ఏం చేసిందో చూడండి..!
King Cobra Video: ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాములలో కింగ్ కోబ్రా పాము ఒకటి. దానితో ఆడటానికి ఎవరూ ఇష్టపడరు. అంతేకాదు దానిని పట్టుకోవడానికి కూడా ఎవరు ప్రయత్నం చేయరు. ఈ పాముల్లో ఉండే విషం ఎంతో ప్రమాదకరం.. ఒక్క సారి మనిషి ఈ పాము కాటు గురైతే..మరణించడం ఖాయం.
King Cobra Video: ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాములలో కింగ్ కోబ్రా పాము ఒకటి. దానితో ఆడటానికి ఎవరూ ఇష్టపడరు. అంతేకాదు దానిని పట్టుకోవడానికి కూడా ఎవరు ప్రయత్నం చేయరు. ఈ పాముల్లో ఉండే విషం ఎంతో ప్రమాదకరం.. ఒక్క సారి మనిషి ఈ పాము కాటు గురైతే..మరణించడం ఖాయం. కాబట్టి ఇవి కనబడితే చాలా మంది బయపడతారు. అయితే ప్రస్తుతం పాముకు సంబంధించిన చాలా వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఇందులో కింగ్ కోబ్రాలను సంబంధించిన వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. పల్లె ప్రాంతాల్లో ఈ కోబ్రాలు తరచుగా ఇళ్లలోకి సంచరిస్తాయి. అయితే వీటిని రక్షించుకునేందుకు ఆటవి శాఖ కూడా తీవ్రంగా కృషి చేస్తుంది.
ఆగ్రహానికి గురైన పాము:
అయితే మీరు ఈ వీడియోలో గమణిస్తే.. ఓ వ్యక్తి 7 అడుగుల పొడవైన కోబ్రాతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే పాము స్నేక్ క్యాచర్ పట్టుకునే క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురవుతూ ఉంటుంది. అయినప్పటీకీ ఆ క్యాచర్ వదలడు.. దీంతో ఆ పాము కాటేసేందుకు వస్తుంది. అయినప్పటికీ ఆ స్నేక్ క్యాచర్ వదలడు ఒక పది నిమిషాల పాటు అలానే ప్రయత్నిస్తాడు. అయితే కింగ్ కోబ్రా తోకను పట్టుకున్న తర్వాత..పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయినప్పటికీ ఆ కోబ్రా చిక్కదు..అయితే చివరి ఆ పాము అలసిపోతుంది. దీంతో క్యాచర్ దానిని పట్టుకుంటాడు. ఆ తర్వాత పట్టుకున్న పాము ఆటవి ప్రాంతంలో వదిలేస్తాడు. అయితే ఈ సన్నివేశాలను ఒడిస్సాలోని పల్లె ప్రాంతంలో చిత్రికరించారు.
ఈ వీడియో వైరల్:
ఈ విషపూరితమైన కోబ్రాను రెస్క్యూ చేసి పట్టుకున్న వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఒడిషా రాష్ట్రంలోని, భద్రక్ జిల్లాల్లో చిత్రికరించారు. అయితే ఈ వీడియోను మీర్జా MD ఆరిఫ్ అనే యూట్యూబ్ చానెల్ పోస్ట్ చేశారు. ఈ వీడియోను 2 లక్షలకు పైనా మంది వీక్షించారు. అయితే నెటిజన్లు ఇలా కామెంట్స్ చేస్తున్నారు.."రెండు నాగుపాములను స్వేచ్ఛా ప్రకృతిలో విడిచిపెట్టి వాటిని రక్షించినందుకు ధన్యవాదాలు!. ఇలా చేయడం చాలా గొప్ప పని అని" అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook